Dulquer Salman : మలయాళ స్టార్ హీరోకి కరోనా.. మొన్న తండ్రి.. నేడు తనయుడు..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు.. యువ హీరో దుల్కర్ సల్మాన్ కోవిడ్ బారినపడ్డారు. నాలుగు రోజుల క్రితం మమ్ముట్టి తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా............

Dulquer Salman : మలయాళ స్టార్ హీరోకి కరోనా.. మొన్న తండ్రి.. నేడు తనయుడు..

Dulqer

Updated On : January 21, 2022 / 6:41 AM IST

Dulquer Salman :  ఇటీవల రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా మలయాళం స్టార్లు కూడా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా కరోనా బారిన పడ్డారు.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు.. యువ హీరో దుల్కర్ సల్మాన్ కోవిడ్ బారినపడ్డారు. నాలుగు రోజుల క్రితం మమ్ముట్టి తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పుడు ఆయన తనయుడికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని దుల్కర్ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

Kathuri Raja : ధనుష్-ఐశ్వర్యలు మళ్ళీ కలుస్తారు: ధనుష్ తండ్రి

”తాను కొద్దీ రోజుల నుంచి కరోనా లక్షణాలు ఉన్నాయని అనిపించడం తో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఇటీవల నన్ను కాంటాక్ట్ అయిన వాళ్లంతా టెస్ట్ చేయించుకోండి. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. కరోనా ఇంకా అయిపోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మాస్క్ వేసుకోండి” అని పోస్ట్ చేశారు. దుల్కర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.