Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌కు ఈడీ నోటీసులు.. వెంటాడుతున్న డ్రగ్స్ వ్యవహారం..!
టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. గతంలో ఈ కేసుకు సంబంధించి ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, నిర్మాత ఛార్మీలను ఈడీ అధికారులు విచారించగా, తాజాగా మరో స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ED Notices To Rakul Preet Singh On Drugs Case
Rakul Preet Singh: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. గతంలో ఈ కేసుకు సంబంధించి ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, నిర్మాత ఛార్మీలను ఈడీ అధికారులు విచారించగా, తాజాగా మరో స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Rakul Preet Singh: అందాలను ఒలకబోస్తూ ఇన్‌స్టాను అల్లాడిస్తున్న బ్యూటీలు!
గతేడాది సెప్టెంబర్ 3న రకుల్ ప్రీత్ సింగ్‌ను ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంపై ఈడీ అధికారులు విచారించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ విచారణ నుంచి మధ్యలోనే రకుల్ వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు ఆమెను మళ్లీ విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ అధికారులు ఆదేశించారు. టాలీవుడ్‌లో 2017లో ఈ డ్రగ్స్ వ్యవహారం బట్టబయలు కావడంతో ఎన్డీపీఎస్ చట్టం కింద తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు కేసును నమోదు చేశారు. ఇక సిట్ ఏర్పాటు కావడం, పలువురు సినీ ప్రముఖులను విచారించడం జరిగింది.
అయితే మనీలాండరింగ్ కింద ఈ కేసును ఈడీ టేకప్ చేయడంతో గతేడాది ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈడీ విచారణకు పూరీ జగన్నాధ్, రవితేజ, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి వంటి స్టార్స్ హాజరు కాగా, ఇప్పుడు మరోసారి రకుల్ ఈ విచారణను ఎదుర్కోనుంది.