Sagileti Katha : ‘ఆర్జీవీ’ చేతుల మీదగా.. ‘సగిలేటి కథ’ మూవీ ‘ఏదో జరిగే’ సాంగ్ గ్రాండ్ లాంచ్..

తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ ఆర్జీవీ డెన్ ఆఫీస్ లో ఈ చిత్రం ఫస్ట్ లిరికల్ 'ఏదో జరిగే' వీడియో సాంగ్ ని ఎంతో గ్రాండ్ గా ఆర్జీవీ చేతుల మీదుగా రిలీజయింది.

Sagileti Katha : ‘ఆర్జీవీ’ చేతుల మీదగా.. ‘సగిలేటి కథ’ మూవీ ‘ఏదో జరిగే’ సాంగ్ గ్రాండ్ లాంచ్..

Edo Jarige song launch from Sagileti Katha Movie by RGV

Updated On : August 18, 2023 / 11:20 AM IST

Sagileti Katha Song launch : హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘రాజశేఖర్ సుద్మూన్’ రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఇప్పటికే, విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు అనుహ్య స్పందన లభించింది.

తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ ఆర్జీవీ డెన్ ఆఫీస్ లో ఈ చిత్రం ఫస్ట్ లిరికల్ ‘ఏదో జరిగే’ వీడియో సాంగ్ ని ఎంతో గ్రాండ్ గా ఆర్జీవీ చేతుల మీదుగా రిలీజయింది. ఈ లిరికల్ సాంగ్ సరిగమ తెలుగు ఛానల్ లో విడుదలైంది. సాంగ్ లాంచ్ అనంతరం డైరెక్టర్ ఆర్జీవీ మాట్లాడుతూ.. సగిలేటి కథ సినిమా ట్రైలర్ చూసాక నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఈ సినిమా ఇంత ఘన విజయంగా కంప్లీట్ చేసి ముందుకి తీసుకెళ్తున్న డైరెక్టర్ రాజశేఖర్ సుద్మూన్ కి, బ్యూటిఫుల్ గా పాడి అందరిని కవ్వించిన కీర్తన శేష్ కి నా ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది. టీం అందరికి నా ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.

ప్రొడ్యూజర్స్ దేవీప్రసాద్ బలివాడ మాట్లాడుతూ.. నేను ప్రొడ్యూజ్ చేసిన మొదటి సినిమా ‘కనుబడుటలేదు’ మూవీ నుండి ‘సగిలేటి కథ’ వరుకు ప్రత్యేక్షంగా అండ్ పరోక్షంగా మా మూవీస్ కి ఆర్జీవీ గారు హెల్ప్ చేస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యు అని తెలిపారు.

డైరెక్టర్ రాజశేఖర్ సుద్మూన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మా సినిమా సాంగ్ ని ఆర్జీవీ గారు చేతుల మీదగా చేయడం వల్ల మాకు ఎంతో ఎనర్జీ వచ్చింది. నేను ఆయనికి ఎంతో రుణపడి ఉంటాను. అలాగే, మా సినిమా ని ప్రజెంట్ చేస్తున్న హీరో నవదీప్ ఎంత చెప్పినా తక్కువే, ఎంత బిజీగా గా వున్న ఇమ్మిడియట్ గా రెస్పాండ్ అయ్యి మాకు కావలిసిన థింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యు నవదీప్ అన్నా అని తెలిపారు.

Edo Jarige song launch from Sagileti Katha Movie by RGV

 

హీరో ‘రవి మహాదాస్యం’ మాట్లాడుతూ.. సగిలేటి కథ ఒక బ్యూటిఫుల్ అండ్ మ్యూజికల్ మూవీ. ఈ సినిమాలో ప్రతి సాంగ్ బాగుంటుంది. ముఖ్యంగా ఏదో జరిగే పాట హాయిగా పాడుతూ నిద్రలోకి జారుకోవచ్చు. కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. చాలా తక్కువ సమయంలోనే మా మూవీ ట్రైలర్ మిలియన్స్ వ్యూస్ రీచ్ అయ్యాయి, అదే విధంగా ఈ సాంగ్ రీచ్ అవ్వుతుందని నమ్మకంతో ఉన్నాం అని తెలిపారు.