వామ్మో వర్మ విధ్వంసం : ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ – టీజర్
రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ టీజర్ విడుదల.. యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్న టీజర్..

రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ టీజర్ విడుదల.. యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్న టీజర్..
‘కాంట్రవర్సీ కింగ్’ రామ్ గోపాల్ వర్మ ఓ వైపు ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇంతలో ఎప్పటినుండో పెండింగులో ఉన్న ‘లేడీ బ్రూస్ లీ’ (ఇప్పుడు పేరు మారింది) సినిమాని బయటకి తీశారు. ఆర్జీవీ తాజా చిత్రం ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ టీజర్ విడుదలైంది. బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను వర్మ విడుదల చేశారు.
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించారు. వర్మ మార్క్ రొమాంటిక్, యాక్షన్ అంతా కనిపిస్తోంది టీజర్‌లో.. పూజా భలేకర్ ఎన్నాళ్లు మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుందో కానీ రఫ్పాడించేసింది.. ఫైట్స్‌తో పాటు, రొమాంటిక్ సీన్స్‌లోనూ రెచ్చిపోయింది. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్టుగానే కనిపిస్తోంది.
ఇది భారతదేశంలో నిర్మించిన తొలి మార్షల్ ఆర్ట్స్ చిత్రమని, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా అని, ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్‌ను బ్రూస్ లీ సొంత పట్టణమైన చైనాలోని ఫోషన్ సిటీలో డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు వర్మ. ఇండో-చైనా సంయుక్త నిర్మాణంలో జింగ్ లియు, టి.నరేశ్, టి.శ్రీధర్ ఈ సినిమాను నిర్మించారు. రవి శంకర్ సంగీతం, రమ్మీ సినిమాటోగ్రఫీ అందించారు.