EVOL : సెన్సార్ దెబ్బకి ఓటీటీ బాట పట్టిన బోల్డ్ సినిమా.. ట్రైలరే ఇలా ఉంటే.. ఇక మూవీలో..!
ఇంగ్లీష్‌లో లవ్ పదాన్ని రివర్స్‌లో రాస్తే ఎవోల్ అని వస్తుంది.

EVOL OTT Release date fix
EVOL OTT Release date : కరోనా కాలం నుంచి ఓటీటీల హవా నడుస్తోంది. ఒకప్పుడు థియేటర్లు దొరక్క విడుదల కానీ చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. థియేటర్లు దొరకకపోతేనేం.. డైరెక్టుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఇలా విడుదలైన సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి కూడా. తాజాగా ఓ రొమాంటిక్ చిత్రానికి సెన్సార్ చిక్కులు ఎదురుకావడంతో డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు.
ఇంగ్లీష్‌లో లవ్ పదాన్ని రివర్స్‌లో రాస్తే ‘ఎవోల్’ అని వస్తుంది. ఇదే టైటిల్‌తో రామ్ వెలగపూడి అనే దర్శకుడు చాలా మంది కొత్తవారితో సినిమాని తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని ముందుగా థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే జూలైలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేదే.
Bhagyashri Borse dance : రవితేజ చూస్తుండగానే.. స్టేజీపై కొరియోగ్రాఫర్‌తో రెచ్చిపోయిన హీరోయిన్..
అయితే.. సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని బ్యాన్ చేసింది. ఈ మూవీలో బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉండడమే కారణం. దీంతో ఈ మూవీని ఓటీటీలో నేరుగా విడుదల చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ఆహా ఫ్లాట్‌ఫామ్‌లో ఆగస్టు 15 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు ఆహా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. మరి సెన్సార్ బ్యాన్ చేసేంతగా సినిమాలో ఏముందే తెలియాలంటే ఓ రెండు రోజులు ఆగాల్సిందే.
Reverse the Love, Change the Game!?◀️#Evolmovie Coming on aha!!? pic.twitter.com/CFqdcPh2of
— ahavideoin (@ahavideoIN) August 12, 2024