Udit Narayan : ఎప్పుడో విడిపోయిన స్టార్ సింగర్ భార్య.. మళ్ళీ డబ్బుల కోసం మాజీ భర్తపై కేసు..
తాజాగా మరోసారి ఉదిత్ నారాయణ్ వార్తల్లో నిలుస్తున్నాడు.

Ex Wife Filed Case on Star Singer Udit Narayan
Udit Narayan : హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ.. అనేక భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్. 69 ఏళ్ళు వచ్చినా ఇంకా ఆయన పాటలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం కూడా వరుసగా సినిమాల్లో పాటలు పాడుతున్నారు. మరోవైపు లైవ్ కాన్సర్ట్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఉదిత్ నారాయణ ఓ అమ్మాయికి లైవ్ షోలో లిప్ కిస్ ఇచ్చి వివాదాల పాలయ్యాడు. తాజాగా మరోసారి ఉదిత్ వార్తల్లో నిలుస్తున్నాడు.
ఉదిత్ నారాయణ్ 1985లో దీప అనే సింగర్ ని పెళ్లి చేసుకున్నాడు. ముంబైలో పెళ్లి చేసుకొని ఇక్కడ సింగర్ అవ్వడంతో సెటిల్ అయిపోయాడు. అయితే అంతకంటే ముందే ఉదిత్ తమ ఊరికి చెందిన రాంజన అనే మహిళను పెళ్లి చేసుకున్నాడట. ఆ విషయం దాచి ముంబైలో దీపని పెళ్లి చేసుకున్నాడు. చాన్నాళ్ల పాటు మొదటి పెళ్లిని సీక్రెట్ గానే ఉంచాడు. 2006లో ఉదిత్ నారాయణ్ మొదటి పెళ్లి బయటకు రావడంతో మొదట సంబంధం లేదు అని బుకాయించినా మొదటి భార్య రాంజన కోర్టుని ఆశ్రయించడంతో ఒప్పుకున్నాడు.
2006 లోనే ఉదిత్ అధికారికంగా మొదటి భార్య రాంజనకు విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చినప్పుడు భరణం కింద ఒక ఇల్లు, కొంత బంగారం, నెలకు 15 వేల రూపాయలు కూడా ఇచ్చేలా బీహార్ మహిళా కమిషన్ ముందు ఒప్పుకున్నాడు. అప్పట్నుంచి ఆమెకు అవి చెల్లిస్తున్నాడు. అయితే తాజాగా మాజీ భార్య రాంజన ఉదిత్ నారాయణ మీద కేసు వేసింది.
రాంజన.. ఉదిత్ నారాయణ్ నాకు సంబంధించిన భూమిని నాకు చెప్పకుండా అమ్ముకున్నాడని, దాంట్లో నాకు రావాల్సిన 11 లక్షల రూపాయలు అతను తీసుకున్నాడు అని, ఆ డబ్బులు ఇప్పించాలని కోర్టులో కేసు వేసింది. ఇప్పటికే దీనిపై ఉదిత్ నారాయణ్ ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యాడని తెలుస్తుంది. దీంతో ఈ వార్త సంచలనంగా మారింది. ఎప్పుడో విడాకులు తీసుకొని, భరణం తీసుకొని వెళ్ళిపోయినా మళ్ళీ ఇన్నేళ్లకు డబ్బుల కోసం కేసు వేయడంతో ఆశ్చర్యపోతున్నారు.
రాంజనను పెళ్లి చేసుకున్నా ముంబైలో దీపను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతోనే ఉన్నాడు ఉదిత్ నారాయణ్. దీప కూడా సింగర్. ఉదిత్ – దీపాలకు ఆదిత్య నారాయణ్ అనే కొడుకు ఉన్నాడు. అతను ఇప్పుడిప్పుడే సింగర్ గా ఎదుగుతున్నాడు.