Babu Mohan : మా చిరు అన్న తమ్ముడు.. వంద రెండొందలు ఫోన్స్ చేశాను.. కానీ.. పవన్ కళ్యాణ్ పై బాబు మోహన్ వ్యాఖ్యలు..
బాబు మోహన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ..

Babu Mohan Interesting Comments on AP Deputy CM Pawan Kalyan
Babu Mohan : ఒకప్పటి స్టార్ కమెడియన్ బాబు మోహన్ ఎన్నో సినిమాలలో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. సినిమాలతో పాటు బాబు మోహన్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాబు మోహన్ రాజకీయాల్లో కాస్త యాక్టివ్ గానే ఉన్నారు.
తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబూమోహన్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి, పవన్ ఎదుగుదల గురించి మాట్లాడారు.
బాబు మోహన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ మా కుటుంబ సభ్యుడు. మా చిరు అన్న తమ్ముడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడే మొదలుపెట్టాడు. ఇప్పుడే పొగడకూడదు. వెళ్తున్నాడు.. ఎవరెస్టు శిఖరం అంత ఎత్తు ఎదుగుతాడు. ప్రజలే ఆయన్ని పొగుడుతారు. నేను ఇటీవల పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు. కానీ కొన్ని రోజుల క్రితం నేను ఒక వంద, రెండు వందలు ఫోన్స్ చేశాను పవన్ కళ్యాణ్ కు. ఎవరో లిఫ్ట్ చేసి ఆయన పీఏలు అని చెప్పేవాళ్ళు. ఒకసారి బాబు మోహన్ ఫోన్ చేసారు అని చెప్పమనేవాడ్ని. కానీ ఆయనతో మాట్లాడలేకపోయాను. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లో నేను, కోట కలిసి మంచి కామెడీ ట్రాక్ చేసాం. అతను మా కుటుంబ సభ్యుడితో సమానం. ఇంకా ఎదుగుతాడు అని అన్నారు.