Salman Khan : సల్మాన్ ఖాన్ బిగ్గెస్ట్ ఫ్లాప్.. దెబ్బకు సినిమాలు మానేసిన డైరెక్టర్.. హాలీవుడ్ నుంచి మళ్ళీ రాని హీరోయిన్..

సల్మాన్ కెరీర్ లో ఓ బిగ్గెస్ట్ ఫ్లాప్ ఉంది. ఆ సినిమాని హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్ట్ చేయడం, అందులో హాలీవుడ్ హీరోయిన్ నటించడం జరిగాయి.

Salman Khan : సల్మాన్ ఖాన్ బిగ్గెస్ట్ ఫ్లాప్.. దెబ్బకు సినిమాలు మానేసిన డైరెక్టర్.. హాలీవుడ్ నుంచి మళ్ళీ రాని హీరోయిన్..

Do You Know about Salman Khan Biggest Flop Movie Directed by Hollywood Directed and Hollywood Actress as Heroine

Updated On : February 25, 2025 / 7:50 AM IST

Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి కూడా పలు ఫ్లాప్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ కెరీర్ లో ఓ బిగ్గెస్ట్ ఫ్లాప్ ఉంది. ఆ సినిమాని హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్ట్ చేయడం, అందులో హాలీవుడ్ హీరోయిన్ నటించడం జరిగాయి. ఆ సినిమా సల్మాన్ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

హాలీవుడ్ దర్శకుడు విల్లార్డ్ కరోల్ ఇండియాకు వచ్చి అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న సల్మాన్ ఖాన్ తో ‘మారిగోల్డ్’ అనే సినిమా తీసాడు. ఈ సినిమాలో అలీ లార్టర్ అనే హాలీవుడ్ హీరోయిన్ నటించింది. 2007 లో ఈ సినిమా రిలీజయింది. దాదాపు 20 కోట్లు పెట్టి తీస్తే మారిగోల్డ్ సినిమా 2 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.

Also Read : Kayadu Lohar : ఇండస్ట్రీలో కొత్త క్రష్.. అస్సాం భామ ‘కయదు లోహర్’.. అన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క సినిమాతో.. తెలుగు, తమిళ్ యూత్ ఫిదా..

మారి గోల్డ్ కథ విషయానికి వస్తే.. ఒక హాలీవుడ్ నటి(అలీ లార్టర్) ఇండియాలో ఆఫర్ రావడంతో ఇక్కడకు వస్తుంది. అనుకోకుండా ఆ ఆఫర్ క్యాన్సిల్ అవుతుంది. తిరిగి అమెరికాకు వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఇంకో సినిమా ఛాన్స్ వస్తుంది. అక్కడ ఆ సినిమా డ్యాన్స్ మాస్టర్(సల్మాన్ ఖాన్) తో ప్రేమలో పడుతుంది. షూటింగ్ కి బ్రేక్ రావడంతో హీరో హీరోయిన్ ని తమ ఊరికి తీసుకెళ్తాడు. అక్కడ అప్పటికే హీరో పెళ్ళికి సెట్ చేస్తారు. కానీ హీరో హాలీవుడ్ నటిని ప్రేమించడంతో ఇంట్లో గొడవలు అవుతాయి. మరో పక్క ఈ హాలీవుడ్ నటి ప్రేమికుడు ఆమెను వెతుక్కుంటూ అమెరికా నుంచి వస్తాడు. చివరకు ఎవరు ఎవర్ని పెళ్లి చేసుకున్నారు అని ఉంటుంది.

Do You Know about Salman Khan Biggest Flop Movie Directed by Hollywood Directed and Hollywood Actress as Heroine

ప్రస్తుతం ఈ మారిగోల్డ్ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా ఫెయిల్ అవ్వడంతో ఆ హాలీవుడ్ డైరెక్టర్ విల్లార్డ్ కరోల్ ఆ తర్వాత ఇంకే సినిమా తీయలేదు. అంతకుముందు హాలీవుడ్ లో డైరెక్టర్ గా మూడు సినిమాలు తీసాడు, రచయితగా కొన్ని సినిమాలకు పనిచేసాడు. మారిగోల్డ్ ఫ్లాప్ తర్వాత మళ్ళీ ఈ దర్శకుడు కనపడలేదు.

Also Read : Urvashi Rautela : సీరియస్ గా ఇండియా – పాక్ మ్యాచ్ జరుగుతుంటే.. స్టేడియంలో దబిడి దబిడి స్టెప్పులు వేసుకుంటున్న హీరోయిన్..

ఇక హాలీవుడ్ లో అప్పటికే క్యారెక్టర్ రోల్స్, హీరోయిన్ గా చేస్తున్న అలీ లార్టర్ మారిగోల్డ్ సినిమా తర్వాత మళ్ళీ ఏ ఇండియా సినిమా చేయలేదు. అక్కడే హాలీవుడ్ లో పలు సినిమాలు, టీవీ షోలు, సిరీస్ లు చేసుకుంటూ బిజీగానే ఉంది. ఇలా సల్మాన్ ఖాన్ కెరీర్లోనే మారిగోల్డ్ సినిమా పెద్ద ఫ్లాప్ సినిమాగా నిలవడంతో హాలీవుడ్ దర్శకుడు సినిమాలకు దూరమయ్యాడు. హాలీవుడ్ హీరోయిన్ మళ్ళీ తిరిగి ఇండియాకు రాలేదు.

Do You Know about Salman Khan Biggest Flop Movie Directed by Hollywood Directed and Hollywood Actress as Heroine