Kayadu Lohar : ఇండస్ట్రీలో కొత్త క్రష్.. అస్సాం భామ ‘కయదు లోహర్’.. అన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క సినిమాతో.. తెలుగు, తమిళ్ యూత్ ఫిదా..
టాలీవుడ్, కోలీవుడ్ లో ఇప్పుడు వినిపిస్తున్న కొత్త క్రష్ పేరు 'కయదు లోహర్'.

Kayadu Lohar New Crush in Tollywood and Kollywood after Return of the Dragon Movie
Kayadu Lohar : ఏ సినిమాతో ఎవరు స్టార్ అవుతారో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క సినిమాతో వస్తుంది. ఇటీవల అన్ని సినీ పరిశ్రమలలో చాలా మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ వైరల్ అవుతుంది. ఈ భామ సినీ పరిశ్రమలోకి ఎప్పుడో వచ్చి పలు సినిమాలు చేసినా ఇప్పుడు పాపులర్ అవుతుంది.
టాలీవుడ్, కోలీవుడ్ లో ఇప్పుడు వినిపిస్తున్న కొత్త క్రష్ పేరు ‘కయదు లోహర్’. ఇటీవల ఫిబ్రవరి 21న ప్రదీప్ రంగనాథన్ హీరోగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజయింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని ఇప్పటికే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్ హీరోయిన్స్ గా నటించారు. కయదు లోహర్ మెయిన్ హీరోయిన్ ఈ సినిమాలో.
ఈ సినిమా హిట్ అవ్వడం, ఇందులో కయదు లోహర్ ని చాలా అందంగా, క్యూట్ గా చూపించడంతో ఒక్కసారిగా ఈ భామ పాపులర్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత యూత్ అంతా కయదు లోహర్ కి ఫిదా అవుతున్నారు. కయదు లోహర్ సోషల్ మీడియాను ఫాలో చేస్తున్నారు. సినిమాలో ఈమె క్యూట్ నెస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది. గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కయదు లోహర్ కనిపిస్తుంది. తెలుగు, తమిళ్ యూత్ కి ఇప్పుడు కయదు లోహర్ కొత్త క్రష్ అయిపొయింది.
అయితే ఈ భామకు ఇది మొదటి సినిమా కాదు. అంతకుముందు కొన్ని సినిమాలు చేసింది. అన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఇప్పుడు రావడం గమనార్హం. కయదు లోహర్ అస్సాంకు చెందిన భామ. పూణేలో సెటిల్ అయ్యారు. మోడలింగ్ చేస్తూ 2021లో కన్నడలో మొగిలిపేట సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మలయాళంలో పథానపాఠం నూత్తాండు అనే సినిమా చేసింది. అనంతరం తెలుగులో శ్రీవిష్ణుతో కలిసి అల్లూరి అనే సినిమా కూడా చేసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. అనంతరం మరాఠీలో ఐ ప్రేమ్ యు, మలయాళంలో ఒరు జాతి జాతకం సినిమాలు చేసింది. ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాతో వచ్చి ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. తర్వాత మరో తమిళ్ సినిమా ఈ భామ చేతిలో ఉంది.
Also See : Rashmi Gautam : షర్ట్ – స్కర్ట్ లో యాంకర్ రష్మీ క్యూట్ ఫొటోలు..
అయితే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో సీరియస్ రోల్స్, గృహిణి పాత్ర, ఫైటర్ పాత్ర.. ఇలాంటి రోల్స్ చేయడం వల్ల తన ఒరిజినాలిటీని చూపించే అవకాశం రాలేదు. ఇప్పుడు ఈ సినిమాలో ఒక యువతిగా, క్యూట్ నెస్ తో, సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగుండటం, తనకు రాసిన సీన్స్ మంచి ఫ్రెష్ ఫీల్ ఇవ్వడంతో ఈమె టాక్ అఫ్ ది టౌన్ అవుతుంది. మరి ఈ సినిమా తర్వాత అయినా కయదు లోహర్ తమిళ్, తెలుగులో బిజీ అవుతుందా చూడాలి.