Urvashi Rautela : సీరియస్ గా ఇండియా – పాక్ మ్యాచ్ జరుగుతుంటే.. స్టేడియంలో దబిడి దబిడి స్టెప్పులు వేసుకుంటున్న హీరోయిన్..
స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంటే ఊర్వశి బాలీవుడ్ సోషల్ మీడియా ఫేమ్ ఓరితో కలిసి దబిడి దబిడి పాటకు స్టెప్పులు వేసింది.

Urvashi Rautela Dance for Balakrishna Dabidi Dabidi Song with Orry while IND Vs PAK Match
Urvashi Rautela : ఆదివారం నాడు దుబాయ్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. కోహ్లీ సెంచరీ చేసాడు. అయితే ఈ మ్యాచ్ కి చాలా మంది సెలబ్టైటిలు హాజరయ్యారు. అందులో బాలీవుడ్ భామ, స్పెషల్ సాంగ్స్ హీరోయిన్ ఊర్వశి రౌటేలా కూడా ఉంది. ఊర్వశి రౌటేలా మ్యాచ్ సందర్భంగా దుబాయ్ స్టేడియం లో సందడి చేసింది.
అక్కడికి వచ్చిన సెలబ్రిటీలు అందర్నీ కలిసింది. సుకుమార్ తో కూడా మాట్లాడిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంటే ఊర్వశి బాలీవుడ్ సోషల్ మీడియా ఫేమ్ ఓరితో కలిసి దబిడి దబిడి పాటకు స్టెప్పులు వేసింది. డాకు మహారాజ్ సినిమాలో బాలయ్యతో కలిసి దబిడి దబిడి అంటూ ఊర్వశి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ స్టెప్పులను ఊర్వశి ఇప్పుడు దుబాయ్ స్టేడియంలో రీ క్రియేట్ చేసింది.
Also See : Divyabharathi : ఎరుపు చీరలో మెరిపిస్తున్న దివ్యభారతి.. ఫోటోలు చూశారా?
దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుంటే నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇండియా గెలిచింది ఊర్వశి దబిడి దబిడి స్టెప్పులు వేస్తుంది అంటూ పలు కామెంట్స్ చేసారు. మొత్తానికి దుబాయ్ స్టేడియంలో ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ఊర్వశి వేసిన దబిడి దబిడి స్టెప్పులు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. మీరు కూడా ఆ వీడియో చూసేయండి..
Also See : Nabha Natesh : అయ్యా బాబోయ్.. నభా నటేష్ నడుము అందాలతో..
బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది. ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలో మొదలుపెట్టి ఆ తర్వాత ఏజెంట్, బ్రో, స్కంద సినిమాల్లో తన సాంగ్స్ తో మెప్పించింది. ఇటీవల సంక్రాతికి బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో దబిడి దబిడి స్టెప్పులతో అదరగొట్టింది.