Mokshagna : మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. క్లాప్ కొట్టేది ఎన్టీఆర్!
బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు? అదిగో... ఇదిగో అంటూ బాలయ్య అభిమానులను ఊరిస్తున్న మోక్షజ్ఞ సినిమాపై తాజాగా మరో గాసిప్...

Exciting Update on Nandamuri Mokshagnas Debut Film
బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు? అదిగో… ఇదిగో అంటూ బాలయ్య అభిమానులను ఊరిస్తున్న మోక్షజ్ఞ సినిమాపై తాజాగా మరో గాసిప్… ఇందులో నిజం ఉందో? లేదో? గానీ ఆ గాసిప్ మాత్రం అభిమానులకు మాత్రం మస్త్ ఖుషీ చేస్తోంది. తమ అభిమాన హీరో కుమారుడి కోసం ఇంకో అభిమాన హీరో క్లాప్ కొడతారనే గాసిప్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుండటంతో.. ఆ ప్రచారం నిజమైతే బాగుంటుందని ప్యాన్స్ కోరుకుంటున్నారట. ఇంతకీ మోక్షజ్ఞ సినిమాకి క్లాప్ కొట్టేది ఎవరో? ఇప్పుడు చూద్దాం
టాలీవుడ్‌లో తాజా గాసిప్ ఒకటి హాట్‌టాపిక్‌గా మారింది. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఊహాగానాలు కొనసాగుతుండగా, మోక్షజ్ఞ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొడతారని తాజా ప్రచారం. దీంతో చాలాకాలంగా నందమూరి కుటుంబంతో ముఖ్యంగా బాలయ్యతో జూనియర్ ఎన్టీఆర్‌కు గ్యాప్ ఉందనే ప్రచారం ఉట్టిదేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబాయ్ బాలయ్య అంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం. పలు బహిరంగ వేదికలపైనే బాలయ్యపై తన ప్రేమను బయట పెట్టారు జూనియర్ ఎన్టీఆర్. బాలయ్య కూడా నందమూరి కుటుంబంలో ఇతర హీరోలను చూసినట్లే జూనియర్ ఎన్టీఆర్‌పైనా ఎంతో ప్రేమాభిమానాలు చూపించేవారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణం తర్వాత కుటుంబంలో కొంత గ్యాప్ వచ్చిందని ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది.
Mahesh Babu : కాలినడకన తిరుమలకు చేరుకున్న సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఫ్యామిలీ..
ఇదే సమయంలో ఏపీ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు కుటుంబంలో కొంతచర్చకు దారితీశాయి. ఏపీలో టీడీపీ-వైసీపీ మధ్య ఆధిపత్య పోరులో నారా-నందమూరి కుటుంబానికి వ్యక్తిగతంగా అవమానాలు ఎదురైనప్పుడు జూనియర్ స్పందించలేదని కుటుంబంలో కొంత అసంతృప్తి ఉందని చెబుతుంటారు. దీనిపై ఎవరూ బహిరంగంగా మాట్లాడకపోయినా, బాలయ్య కుటుంబంలో జరిగిన కార్యక్రమాల్లో జూనియర్ కనిపించకపోవడంతో గ్యాప్ ఉందనే గాసిప్పే ఎక్కువగా ప్రచారంలో ఉంటోంది.
ఇక ఇప్పుడు ఆ ప్రచారం అంతా ఉట్టిదేననే తేల్చేందుకు మోక్షజ్ఞ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్‌తో క్లాప్ కొట్టించాలని ప్రపొజల్ వచ్చిందంటున్నారు. మోక్షజ్ఞ సైతం నటన, డ్యాన్స్‌లో జూనియర్‌ను ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు. స్టోరీ సెలక్షన్, డైలాగ్ డెలవరీ, యాక్షన్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాడట మోక్షజ్ఞ. ఇక ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవని మోక్షజ్ఞ సినిమాతోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. నిజంగా ఈ ప్రచారం నిజమైతే బాగుటుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.