RGV – Fahadh Faasil : ఆర్జీవీతో ఫహద్ ఫాజిల్.. వీళ్లిద్దరు ఎందుకు కలిసారో.. ఏం ప్లాన్ చేస్తున్నారో..

తాజాగా ఆర్జీవీ మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ తో కలిసి కనపడ్డాడు.

RGV – Fahadh Faasil : ఆర్జీవీతో ఫహద్ ఫాజిల్.. వీళ్లిద్దరు ఎందుకు కలిసారో.. ఏం ప్లాన్ చేస్తున్నారో..

Fahadh Faasil Meets Director Ram Gopal Varma in RGV Den Photos goes Viral

Updated On : October 11, 2024 / 2:45 PM IST

RGV – Fahadh Faasil : ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఇప్పుడు మాత్రం తన ఇష్టమంటూ తనకిష్టమొచ్చిన సినిమాలు తీసుకుంటున్నాడు. కానీ ఎప్పటికైనా మళ్ళీ ఆర్జీవీ తన స్టైల్ లో ఒక మంచి సినిమా తీయకపోతాడా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్జీవీ ఏ పెద్ద హీరో, హీరోయిన్ ని కలిసిన ఆ వార్త వైరల్ అవుతుంది.

Also Read : Janvi Kapoor : నేను బతుకుతాను అని అనుకుంటున్నాను.. ‘దేవర’ షూటింగ్ వీడియోలు పోస్ట్ చేసిన జాన్వీ కపూర్..

తాజాగా ఆర్జీవీ మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ తో కలిసి కనపడ్డాడు. ఇప్పుడున్న బెస్ట్ యాక్టర్స్ లో ఫహద్ ఫాజిల్ ఒకడు. ప్రస్తుతం ఫహద్ సౌత్ లో అన్ని భాషల్లో రకరకాల పాత్రలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఫహద్ ఫాజిల్ ఆర్జీవీ డెన్ కి వెళ్లి ఆర్జీవీతో సెల్ఫీ దిగాడు. ఆర్జీవీ డెన్ లో కొన్ని ఫోటోలు దిగాడు ఫహద్. ఆర్జీవీ డెన్ లో ఫహద్ ఫాజిల్ దిగిన ఫొటోని, తనతో తీసుకున్న సెల్ఫీని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

View this post on Instagram

A post shared by RGV (@rgvzoomin)

అయితే ఈ ఫోటోలు షేర్ చేసి.. మూవీ షూట్ అనుకున్నారా? జస్ట్ నా డెన్ కి వచ్చి నన్ను కలిసాడు ఫహద్ అని క్లారిటీ ఇచ్చేసాడు ఆర్జీవీ. మరి నిజంగానే ఊరికే ఆర్జీవీని కలవడానికి ఫహద్ వచ్చాడా? వీళ్లిద్దరు కలిసి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా చూడాలి.