Father Son Multi Starrers: ఫ్యామిలీ ప్యాకేజ్.. ట్రెండ్ సెట్ చేస్తున్న తండ్రీ కొడుకులు
ఎక్కడ చూసినా తండ్రీ కొడుకులే. ఏ సినిమా ఇండస్ట్రీలో చూసినా వీళ్లిద్దరే. ఎలాంటి జానర్ చూసినా ఈ ఫాదర్ అండ్ సన్నే కనిపిస్తున్నారు. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఈ తండ్రీ కొడుకుల డ్యుయో తెగ ట్రెండ్ అవుతూ కుంటుంబ కథా చిత్రాల్ని తెరమీదకు తెస్తున్నారు.

Father Son Multi Starrers
Father Son Multi Starrers: ఎక్కడ చూసినా తండ్రీ కొడుకులే. ఏ సినిమా ఇండస్ట్రీలో చూసినా వీళ్లిద్దరే. ఎలాంటి జానర్ చూసినా ఈ ఫాదర్ అండ్ సన్నే కనిపిస్తున్నారు. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఈ తండ్రీ కొడుకుల డ్యుయో తెగ ట్రెండ్ అవుతూ కుంటుంబ కథా చిత్రాల్ని తెరమీదకు తెస్తున్నారు. తండ్రీకొడుకులు ఒకే సినిమాలో చేస్తున్నారంటే.. జనరల్ గానే ఆ సినిమా మీద హైప్ క్రియేట్ అవుతుంది.. ఆడియన్స్ లో ఇంట్రస్ట్ పుడుతుంది. అయితే అటు యాక్షన్ లో, ఫిజిక్ లో, పర్ ఫామెన్స్ లో, లుక్స్ లో.. ఇలా ఏ ఎలిమెంట్ తీసుకున్నా.. నువ్వానేనా అంటూ పోటీపడుతున్నారు ఈ యంగ్ తండ్రీ కొడుకులు.
Telugu Multi Starrer Films: మల్టీస్టారర్ హవా.. డైరెక్టర్‌ల క్రేజీ కాంబోలు!
స్క్రీన్ మీద ఒక్క హీరోని చూడడానికే తెగ సంబరపడిపోయే జనాలు.. హీరోలుగా ఉన్న తండ్రీ కొడుకుల్ని చూడడానికి వెయిట్ చేస్తుంటారు. లేటెస్ట్ గా ఈ ట్రెండ్ ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. తెలుగులో స్పెషల్లీ టాప్ ప్లేస్ లో ఉన్న తండ్రీ కొడుకుల సినిమా ఆచార్య రిలీజ్ అవుతోంది. ఎక్కడ చూసినా ఈ ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ గురించే చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ పోటాపోటీగా నటిస్తున్న ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ధియేటర్లోకొస్తోంది. చిరంజీవి, చరణ్ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించినా.. ఆడియన్స్ ఆనందం పీక్స్ లో ఉంటుంది. ఒకరి సినిమాలో మరొకరు ఎప్పుడూ క్యామియో రోల్స్ మాత్రం చేసే వీళ్లిద్దరూ ఈ సారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అభిమానుల మనసు నిండే లాగా.. మేజర్ లీడ్ క్యారెక్టర్లు ప్లే చేస్తున్నారు.
Multi Starrer Movies : భారీ హైప్ సినిమాలు.. ఏం చేస్తారో మరి..?
తెలుగులో ఎప్పుడెప్పుడు ఈ తండ్రీ కొడుకులు నటిస్తే చూద్దామా అని వెయిట్ చేసే మరో పెయిర్ నాగార్జున, నాగచైతన్య, అఖిల్. ఈ అక్కినేని ఫ్యామిలీలో తండ్రీకొడుకులు ఎప్పుడు ఏ సినిమా చేసినా అది మంచి సక్సెస్ అందుకుంది. మనం లాంటి సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అక్కినేని నాగార్జున, నాగచైతన్య.. ఈ సంక్రాంతికి బంగార్రాజు మూవీలో మరోసారి కుటుంబసమేతంగా చేసి తమ క్రేజ్ కంటిన్యూ చేశారు.
Malty starrer Movies: వచ్చేస్తున్న టాప్ స్టార్ మల్టీస్టారర్ కాంబినేషన్స్!
తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా ఈ తండ్రీ కొడుకుల సినిమాలు సూపర్ ట్రెండ్ అవుతున్నాయి. లేటెస్ట్ గా తమిళ్ లెజెండరీ యాక్టర్ విజయ్, ఆయన కొడుకు అరుణ్ విజయ్, అతని కొడుకు అర్నవ్ విజయ్ ఈ ముగ్గురూ కలిసి క్రేజీ కుటుంబ కథా చిత్రమ్ చేశారు. ఓటీటీలో రిలీజ్ అయిన ఓ మై డాగ్ అనే ఈ ఇంట్రస్టింగ్ మూవీలో ముగ్గురూ తమ స్క్రీన్ ప్రజెన్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేశారు.
Mahesh-Rajamouli: క్రేజీ కాంబో కోసం విక్రమ్ డేట్స్.. ఇందులో నిజమెంత?
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కూడా తనకొడుకు ధృవ్ తో క్రేజీయాక్షన్ ఎంటర్ టైనర్ చేశారు. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న ధృవ్, ఆల్రెడీ తన పర్ ఫామెన్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేసే విక్రమ్ తో పోటీపడి మరీ చేసిన మహాన్ మూవీ ఓటీటీలో ట్రెండ్ క్రియేట్ చేసింది. తండ్రీ కొడుకుల్లాకాకుండా అన్నదమ్ముల్లా అగ్రెసివ్ యాక్షన్ తో నువ్వా నేనా అన్నట్టు యాక్షన్ తో ఎంటర్ టైన్ చేశారు విక్రమ్, ధృవ్.
Chiranjeevi: మల్టీస్టారర్ మూవీలకు మెగాస్టార్ మక్కువ.. నెక్ట్స్ కూడా అదేనా..?
మళయాళంలో ఉన్న మరో ఇంట్రస్టింగ్ పెయిర్.. దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి. 70ల్లో ఉన్నా మమ్ముట్టి ఇంకా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. మరో వైపు యంగ్ అండ్ హ్యాండ్సమ్ దుల్కర్ కూడా తెలుగు, తమిళ్, మళయళం, హిందీ అన్న తేడా లేకుండా అంతే స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. ఈ తండ్రీకొడుకులిద్దరి ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
YASH : అందుకే బాలీవుడ్ సినిమాలు సౌత్‌లో ఆడవు.. బాలీవుడ్ సినిమాలపై యశ్ వ్యాఖ్యలు..
బాలీవుడ్ లో అయితే తండ్రీ కొడుకుల కుటుంబ కథా చిత్రాలకు లోటు లేదు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో యాడ్ అయ్యారు అనిల్ కపూర్, కొడుకు హర్షవర్దన్ కపూర్. ఈ క్రేజీ ఫాదర్ అండ్ సన్ డ్యుయో ధార్ అనే సినిమా చేశారు. తండ్రీకొడుకులిద్దరూ కలిసి స్టెప్పులేసుకుంటూ, సాంగేసుకునే సాఫ్ట్ సినిమా కాకుండా ఓ రేంజ్ లో వయొలెన్స్, యాక్షన్ ఉన్న సీరియస్ సినిమా చేశారు. దొంగగా కొడుకు హర్ష నటిస్తే.. పోలీస్ గా అనిల్ కపూర్ అల్టిమేట్ ఖల్లాస్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశారు.
Allu Arjun: వారసత్వ హీరోనే కానీ.. సెపరేట్ క్రేజ్, ఇమేజ్ బన్నీ సొంతం!
మరో క్రేజీ ఫాదర్ అండ్ సన్ డ్యుయో.. జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్. హీరో, విలన్, క్యారెక్టర్స్ చేస్తున్న జాకీ ష్రాఫ్.. స్టంట్స్, క్యూట్ లుక్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేసే టైగర్ ష్రాఫ్ కలిసి బాగీ 3 లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు. ఈ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ మూవీలో టైగర్ తన స్టంట్స్ తో ఎంగేజ్ చేస్తే.. జాకీ తన మెస్మరైజింగ్ మాస్ యాక్టింగ్ తో అలరించారు.