Rashmika Mandanna : విజయ్‌తో ఎంగేజ్మెంట్ వార్తలు.. సోషల్ మీడియాలో రష్మికకు ఫ్యాన్స్ ప్రశ్నలు..

విజయ్ దేవరకొండ-రష్మికలకు ఫిబ్రవరిలో నిశ్చితార్థం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వమంటూ రష్మికను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

Rashmika Mandanna

Rashmika Mandanna : ‘యానిమల్’ సినిమా సూపర్ హిట్ చేసిన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ రష్మిక ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ పోస్టు కింద అభిమానులు విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ వార్తల గురించి ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది.

Sankranti Movies : సంక్రాంతి సినిమాల వివాదం.. మీడియా వారిని హెచ్చరిస్తూ.. ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారనే వార్త చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. తాజాగా ఫిబ్రవరి రెండోవారంలో వీరి నిశ్చితార్ధం ఉంటుందంటూ వార్తలు వచ్చాయి. నేషనల్ మీడియా ఈ వార్తలను ప్రచురించడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. కాగా ఈ జంట మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా రష్మిక యానిమల్ సినిమా విజయానికి కారణమైన అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఆమె పోస్టు కింద విజయ్ దేవరకొండతో పెళ్లి గురించి నెటిజన్లు ప్రశ్నించడం మొదలుపెట్టారు.

David Warner : ఆత్మ‌క‌థ రాస్తున్న డేవిడ్ వార్న‌ర్‌.. జ‌స్ట్ 2వేల పేజీలేన‌ట‌.. చ‌దివితే..

యానిమల్ సినిమా పట్ల ఆదరణ చూపించినందుకు అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ  సక్సెస్ మీట్ కోసం రెడీ అయిన ఫోటోలను పోస్ట్ చేసారు రష్మిక. ఇక ఆ పోస్టు కింద అభిమానులు మీకు విజయ్ దేవరకొండతో నిశ్చితార్ధం జరుగుతుందని విన్నాము నిజమేనా?.. మీ నిశ్చితార్థం అనౌన్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాము.. అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. రష్మిక నుండి ఎటువంటి సమాధానం రాలేదు. త్వరలో ఈ జంట గుడ్ న్యూస్ ఏమైనా చెబుతారేమో చూడాలి. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 లో నటిస్తున్నారు. దీంతో పాటు గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్నారు.