Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఇది మర్చిపోయారుగా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగా, ఇదొక రీమేక్ మూవీ అని అందరూ మరిచిపోయారు.
![Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఇది మర్చిపోయారుగా! Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఇది మర్చిపోయారుగా!](https://10tv.in/wp-content/uploads/2023/05/Fans-Forgot-Ustaad-Bhagath-Singh-Is-A-Remake.jpg)
Fans Forgot Ustaad Bhagat Singh Is A Remake
Pawan Kalyan Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో తెరకెక్కతున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్ (Boxoffice) వద్ద రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గలలో టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమా నుండి తాజాగా ఓ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. అయితే, ఈ సినిమాను హరీష్ శంకర్ అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్నాడని, ఈ గ్లింప్స్ చూస్తే అర్థమువుతోంది. కాగా, ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ ‘తేరి’కి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ గతంలో వెల్లడించింది.
Ustaad Bhagat Singh : ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోద్ది.. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ వచ్చేసింది..
కానీ, ప్రస్తుతం ఈ సినిమాపై నెలకొన్నా బజ్ ఈ మూవీ ఓ రీమేక్ సినిమా అనే విషయాన్ని మరిచిపోయేలా చేసింది. పవన్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరిగిరాయనుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి సునామీని క్రియేట్ చేస్తాడో చూడాలి.