Ustaad Bhagat Singh : ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోద్ది.. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ వచ్చేసింది..
ఉదయం ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు గ్లింప్స్ తో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు.

Pawan Kalyan Harish Shankar Ustaad Bhagat Singh glimpse released
Ustaad Bhagat Singh : గబ్బర్ సింగ్ తరువాత మరోసారి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కేవలం 8 రోజులోనే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసిన చిత్ర యూనిట్.. ఇప్పుడు తదుపరి షెడ్యూల్ కి సిద్దమవుతుంది. అయితే ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు మూవీ టీం రెడీ అయ్యారు. పవన్ అండ్ హరీష్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ నేటితో (మే 11) 11 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది.
దీంతో ఈ స్పెషల్ డేని మరింత స్పెషల్ చేసేలా ఉస్తాద్ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మార్నింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసి ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేసిన మూవీ టీం తాజాగా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ పవన్ అభిమానులతో పాటు ప్రతి ఒకర్ని ఆకట్టుకుంది. మరోసారి ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ జాతర తీసుకు రాబోతుందని తెలుస్తుంది. కాగా ఉస్తాద్ షెడ్యూల్ పూర్తి చేసి OG సెట్స్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఇటీవల OG షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు.
Pawan Kalyan OG : మహారాష్ట్రలో జనసైనికులతో పవన్.. OG లుక్ అదిరిపోయిందిగా!
పవన్ త్వరలోనే మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొనున్నాడు. శ్రీలీల (Sreeleela) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. గబ్బర్ సింగ్ కి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఆడియో పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.