Sushmita and Rohman : దీపావళి పార్టీలో కలిసిన ఆ ఇద్దరూ.. పెళ్లి చేసుకోమని కోరుతున్న ఫ్యాన్స్
సుస్మితా సేన్- రోహ్మన్ షాల్‌లు దీపావళి పార్టీలో మెరిశారు. గతంలో బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట తాజాగా మళ్లీ కలిసి కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.

Sushmita and Rohman
Sushmita and Rohman : సుస్మితా సేన్- రోహ్మన్ షాల్ ఒకప్పుడు ప్రేమికులు. 2021 లో విడిపోయారు. తాజాగా ఈ జంట దీపావళి పార్టీలో కలవడం.. ఫోటోలు దిగడం హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరు మళ్లీ కలవడం చూసిన ఫ్యాన్స్ మాత్రం పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు.
Zeenat Aman : సోషల్ మీడియాలో తన ఆరోగ్య పరిస్థితిని షేర్ చేసిన నటి.. ప్టోసిస్‌తో బాధపడుతూ..
సుస్మితా సేన్ తన మాజీ ప్రియుడు నటుడు రోహ్మన్ షాల్‌తో కనిపించడం అభిమానులను షాక్‌కి గురి చేసింది. ఇద్దరు దీపావళి పార్టీకి అటెండ్ అయ్యారు. అంతేనా ఫోటోలకు కలిసి ఫోజులిచ్చారు. 2021 లో తామిద్దరం విడిపోయామని సుస్మితా సేన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజాగా వీరిద్దరు మళ్లీ కలవడం చర్చనీయాంశంగా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో సుస్మితా నలుపు, గులాబీ రంగు చీరలో అందంగా కనిపించారు. రోహ్మన్ ఆకుపచ్చ బ్లేజర్‌తో తెల్లటి కుర్తా-పైజామా వేసుకున్నారు. వీడియోలో రోహ్మన్ సుస్మిత చేతులు పట్టుకుని చీరలో ఆమె నడుస్తుంటే సాయం చేసారు. ఇద్దరు ఫోటోగ్రాఫర్లకు క్యూట్‌గా ఫోజులు ఇచ్చారు.
Sravanthi Ravi Kishore : త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
సుస్మితా సేన్-రోహ్మన్ షాల్ వీడియో వైరల్ అయిన కొద్దిసేపటికే అభిమానులు కామెంట్లు పెట్టారు. వీరిద్దరిని కలిసి చూడటం సంతోషాన్ని కలిగిస్తోందని కొందరు కామెంట్లు పెడితే వీరి జంట బాగుంటుందని.. పెళ్లి చేసుకోమని సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram