Coronavirus : రెండు డోసులు తీసుకున్నా..ఫరాఖాన్‌కు కరోనా
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా..తనకు పాజిటివ్ వచ్చిందని స్వయంగా ఫరాఖాన్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.

Fara
Farah Khan : కరోనా ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతోంది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.
Read More : Kia India: కియా ఇండియా నుంచి మరో సూపర్ మోడల్
అయితే…వ్యాక్సిన్ తీసుకున్నా..మరోసారి కరోనా సోకడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. రెండు డోసులు తీసుకున్న వారు సైతం వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో బాలీవుడ్ దర్శకురాలు, కొరయోగ్రాఫర్ ఫరా ఖాన్ కూడా చేరారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా..తనకు పాజిటివ్ వచ్చిందని స్వయంగా ఫరాఖాన్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.
Read More : TRS Party Office : రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ
రెండుసార్లు టీకా వేయించుకున్నా..డబుల్ డోస్ తీసుకున్న వారితో పని చేస్తున్న తనకు కరోనా సోకుతుందని అస్సలు ఊహించలేదని వెల్లడించారు. వెంటనే ఈ విషయాన్ని అందరికీ తెలియ చేయడం జరిగిందని, తనతో సన్నిహితంగా మెలిగిన వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Read More : Prostitution Activity : స్పా పేరుతో వ్యభిచారం… భవనాన్ని సీజ్ చేసిన పోలీసులు
వీలైనంతా ఈ వైరస్ ను జయిస్తానని ఆశిస్తున్నట్లు ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా తెలియచేశారు. ఇక ఫరాఖాన్ విషయానికి వస్త…ప్రస్తుతం ఈమె జీ కామెడీ షోలో జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉండడంతో ఫరా ఖాన్ స్థానంలో మరొకరిని భర్తీ చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.