HBD Pawan Kalyan: ఫ్యాన్స్‌కు పండగే.. నేడు నాలుగు అప్‌డేట్‌లు!

మెగా అభిమానులకు, పవన్ కళ్యాణ్ భక్తులకు నేడు పండుగరోజు. తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే అభిమానుల కోలాహలం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

HBD Pawan Kalyan: ఫ్యాన్స్‌కు పండగే.. నేడు నాలుగు అప్‌డేట్‌లు!

Hbd Pawan Kalyan

Updated On : September 2, 2021 / 7:23 AM IST

HBD Pawan Kalyan: మెగా అభిమానులకు, పవన్ కళ్యాణ్ భక్తులకు నేడు పండుగరోజు. తమ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుందంటే అభిమానుల కోలాహలం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ కు అభిమానులను మించి వీర భక్తులు ఉంటారని చెప్పుకుంటారు. కేవలం సాధారణ ప్రేక్షకులే కాదు.. సెలబ్రిటీలు సైతం పవన్ కు అభిమానులుగా ఉండడంతో ఈరోజు ఎప్పుడూ స్పెషల్ గా ప్లాన్ చేస్తుంటారు. ఓ వైపు ఫ్యాన్స్ బర్త్ డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తే మరోవైపు మేకర్స్ సర్‌ప్రైజ్ అప్ డేట్స్ సిద్ధం చేశారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అప్ డేట్స్ ప్లాన్ చేశారు. పవన్- క్రిష్ జాగర్లమూడి కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ నుంచి కీలక అప్డేట్ రానుండగా, రానా దగ్గుబాటితో కలిసి పవన్ నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ ‘భీమ్లా నాయక్’ నుంచి కూడా ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇవ్వనున్నారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ చేయనున్న సినిమా అప్ డేట్ తో పాటు ఎస్ఆర్టీ ఎంటర్ టైన్మెంట్స్ నుండి మరో అప్ డేట్ రానుంది.

ఇందులో ఉదయం 11.06కు భీమ్లా నాయక్ సినిమా నుండి టైటిల్ సాంగ్ రానుండగా.. మధ్యాహ్నం 1.20 గంటలకు హరిహరవీరమల్లు అప్ డేట్, మధ్యాహ్నం 2.20కు ఎస్ఆర్టీ ఎంటర్ టైన్మెంట్స్ నుండి అప్ డేట్ రానుండగా.. సాయంత్రం 4.05కు హరీష్ శంకర్ సినిమా అప్ డేట్ విడుదల చేయనున్నారు. ఒకవైపు పవన్ అభిమానులు ఈ పుట్టినరోజుకు భారీ ఏర్పాట్లు చేయగా మేకర్స్ నుండి రానున్న అప్ డేట్స్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేయనున్నాయి.