Tollywood : టాలీవుడ్‌లో ఇన్ని సీక్వెల్స్ రాబోతున్నాయా.. మొత్తం 15 చిత్రాలు.. ఏంటవి..!
టాలీవుడ్ లో రానున్న రోజుల్లో మొత్తం 15 చిత్రాల సీక్వెల్స్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అవేంటో ఓ లుక్ వేసేయండి.

fifteen telugu movies sequels are coming in tollywood and pan India wide
Tollywood : ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు నేషనల్‌తో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా మంచి ఇంటరెస్ట్ క్రియేట్ అవుతుంది. దీంతో తెలుగు మేకర్స్ కూడా సూపర్ హిట్స్ సాధించిన సినిమాలకు కొనసాగింపు, లేదా ఒక కథనే రెండు మూడు భాగాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ లో రానున్న రోజుల్లో మొత్తం 15 చిత్రాల సీక్వెల్స్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అవేంటో ఓ లుక్ వేసేయండి.
ముందుగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం..
#పుష్ప 2..
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు 15న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
#సలార్ 2..
ఇక రీసెంట్ గా వచ్చిన ప్రభాస్, ప్రశాంత్ నీల్ ‘సలార్ పార్ట్ 1’ సినిమా కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో ఈ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా 2025లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Also read : Pooja Kannan : సాయి పల్లవి చెల్లెలు.. పూజ కన్నన్ నిశ్చితార్థం ఫోటోలు వచ్చేశాయి..
#దేవర..
ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘దేవర’ కూడా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై కూడా భారీ హైప్ నెలకుంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది.
#జై హనుమాన్..
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘హనుమాన్’.. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. ఇక ఈ మూవీ సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ ఫస్ట్ పార్ట్ ని ఎండ్ చేసిన తీరు ‘జై హనుమాన్’ పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా 2025 లో రాబోతుంది.
#కార్తికేయ 3..
నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ టాలీవుడ్ లో సూపర్ హిట్ అవ్వడంతో, కార్తికేయ 2 తీసుకు వచ్చారు. అది పాన్ ఇండియా వైడ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆ మూవీ ఎండింగ్ లోనే మూడో భాగానికి లీడ్ ఇచ్చి హైప్ క్రియేట్ చేశారు. ఈ సినిమా కూడా 2025లోనే వచ్చే అవకాశం ఉంది.
ఇక రీజినల్ సినిమాలు విషయానికి వస్తే..
#అఖండ & బింబిసారా..
బాలకృష్ణ ‘అఖండ’, కళ్యాణ్ రామ్ ‘బింబిసారా’ సినిమాలు.. ఈ ఇద్దరి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. దీంతో ఈ మూవీస్ ని సీక్వెల్స్ గా మళ్ళీ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
#గూఢచారి & హిట్..
సస్పెన్స్ థ్రిల్లర్స్ గూఢచారి, హిట్ సినిమాలు ఆడియన్స్ ని థ్రిల్ చేసి సూపర్ హిట్స్ గా నిలిచాయి. అడవి శేష్ ‘గూఢచారి 2’ని ఆల్రెడీ పట్టాలు ఎక్కించి షూటింగ్ చేస్తున్నారు. ఇక శైలేష్ కొలను తెరకెక్కించిన ‘హిట్’ మూవీ సిరీస్ లో భాగంగా మూడో పార్ట్ నాని హీరోగా రాబోతుంది.
Also read : Naresh : ‘మా’ ఎలక్షన్ విషయంలో.. చిరంజీవి గారిని బాధ పెట్టినందుకు.. నేను బాధ పడుతున్నా..
#విరూపాక్ష & గీతాంజలి..
సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, అంజలి మెయిన్ లీడ్ లో నటించిన ‘గీతాంజలి’.. హారర్ థ్రిల్లర్ గా వచ్చి సూపర్ హిట్స్ అందుకున్నాయి. దీంతో సీక్వెల్స్ పై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంటూ ఆల్రెడీ అంజలి సీక్వెల్ పని స్టార్ట్ చేసేసారు. సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో చూడాలి.
#ఇస్మార్ట్ శంకర్ & ప్రాజెక్ట్ Z..
రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, సందీప్ కిషన్ ‘ప్రాజెక్ట్ Z’ చిత్రాలు సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చి సూపర్ హిట్స్ అందుకున్నాయి. దీంతో రామ్ ఆల్రెడీ ‘డబల్ ఇస్మార్ట్’ అంటూ సీక్వెల్ పని స్టార్ట్ చేసేసారు. సందీప్ కిషన్ ఈ సీక్వెల్ ని పట్టాలు ఎక్కించాల్సి ఉంది.
#డీజే టిల్లు & శతమానంభవతి..
సిద్దు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ యూత్ ని అలరిస్తే, శర్వానంద్ ‘శతమానంభవతి’ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచిన ఈ చిత్రాల సీక్వెల్స్ కూడా రెడీ అవుతున్నాయి. ‘టిల్లు స్క్వేర్’ షూటింగ్ చివరి దశలో ఉంది. శతమానంభవతి షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది.