Bandla Ganesh : మెగాస్టార్ చిరంజీవిపై బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Bandla Ganesh : మెగాస్టార్ చిరంజీవిపై బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Bandla Ganesh

Updated On : August 11, 2021 / 7:21 PM IST

Bandla Ganesh comments Chiranjeevi : సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించే బండ్ల..ఈసారి మెగాస్టార్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

చిరంజీవి ఫొటోను షేర్ చేస్తూ ‘మా దేవరకి అన్న..అందరికి నేను అనే నమ్మకం. మనిషి అంటే ఇలా ఉండాలి..అని ప్రజలకు చెప్పిన మహోన్నత వ్యక్తి మా పెద్దన్న మెగస్టార్’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశాడు. అయితే ఈ ట్వీట్ ను బండ్ల గణేష్ ఏ సందర్భంగా చేశాడన్నది మాత్రం చెప్పలేదు.

బండ్ల గణేష్.. మెగా అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే అతనికి చాలా ఇష్టం. పవన్ కు ఆయన వీరాభిమాని. ఇటీవల పవన్ కళ్యాణ్ కు దేవర అనే పేరు కూడా పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. చిరంజీవిపై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలావుంటే కష్టాల్లో ఉన్నవారు సాయం కోసం ట్విట్టర్ ద్వారా తనను అభ్యర్థిస్తే బండ్ల గణేష్ వెంటనే స్పందించి తనకు తోచిన సాయం అందిస్తుంటాడు. ఓ నెటిజన్ తన తల్లి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుందని, వైద్యానికి రూ.20 లక్షల ఖర్చు అవుతుందని, వీలైన సాయం చేయాల్సిందిగా ట్విట్టర్ లో అందరినీ అభ్యర్థించాడు.

దీనిపై స్పందించిన బండ్ల గణేష్..‘మీ గూగుల్ పే నెంబర్ ఇవ్వండి. మనం ఆ దేవుడు ఆశీస్సులతో మీ అమ్మ గారిని కాపాడుకునేందుకు ప్రయత్నిద్దాం’ అంటూ ట్వీట్ చేశాడు.