ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఆర్థిక సాయం

87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత..

  • Published By: sekhar ,Published On : April 13, 2020 / 02:12 PM IST
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఆర్థిక సాయం

Updated On : April 13, 2020 / 2:12 PM IST

87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత..

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో మిగ‌తా విభాగానికి చెందిన వారితో పాటుగా, సినిమా రంగానికి చెందిన సినీ పాత్రికేయులు కూడా ఇబ్బందులు ఎదుర్కోక త‌ప్ప‌లేదు. ప్ర‌తీరోజు ప్రెస్ మీట్స్‌లో బిజీగా ఉండే సినీ పాత్రికేయులు కూడా ఇంట్లోనే ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వారికి ఆస‌రాగా నిల‌వాల‌న్న‌ ఉద్దేశ్యంతో స‌భ్యులంద‌రికీ అసోసియేష‌న్ ద్వారా దాదాపు మెంబ‌ర్లు అంద‌రికీ పోన్లు చేసి ఎలాంటి తార‌త‌మ్యం లేకుండా, వ‌ద్దన్న వారిని వ‌దిలేసి 87 మందికి సోమ‌వారం నాడు ఒక్కొక్క మెంబ‌ర్‌కి ఐదువేల రూపాయ‌లు చొప్పున వారి అకౌంట్‌లో నెప్టీ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయ‌డం జ‌రిగింది. అలాగే గ‌త వారం కొంత మంది మెంబ‌ర్స్‌కి నిత్యావ‌స‌ర వ‌స్తువులను కూడా అందించ‌డం జ‌రిగింది.

ఈసంద‌ర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు సురేష్ కొండేటి మాట్లాడుతూ, ‘క‌మిటీ స‌భ్యులంద‌రి స‌హాయ స‌హకారాల‌తో మ‌రియు హెల్త్ క‌మిటీ చైర్మెన్ రెడ్డి హ‌నుమంతురావు, ముర‌ళీ స‌హ‌కారంతో మెంబ‌ర్స్‌కి సంబంధించిన‌ వివ‌రాలు సేక‌రించి 87 మంది మెంబ‌ర్స్‌కి ఒక్కొక్క‌రికి ఐదు వేల రూపాయ‌లు చొప్పున పంపించ‌గ‌లిగాం. సినిమా ఇండ‌స్ర్టీలోని 24 క్రాప్ట్స్‌కి ఎప్పుడూ ముందుండి వారి గురించి ప్ర‌జ‌ల‌కు చేర‌వేసేది మా సినీ పాత్రికేయ కుటుంబ‌మేన‌ని చెబుతూ మీరు సినీ కార్మికుల సంక్షేమం కోసం చేసే మంచి ప‌నుల విష‌యంలో సినీ పాత్రికేయుల‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Film Journalist Critics Association Members got 5000 Rupees
జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జ‌నార్ధ‌న్ రెడ్డి మాట్లాడుతూ, ‘స‌మిష్టిగా అంద‌రూ క‌లిసి ప‌నిచేస్తున్నాం. క‌మిటీ స‌భ్యులంద‌రి స‌హ‌కారంతో ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి విప‌త్తు ఎప్పుడూ రాకూడ‌ద‌ని కోరుకుంటున్నాను’ అన్నారు. స‌భ్యుల మంచి కోసం ఎప్పుడూ మా క‌మిటీ ముందు ఉండి ప‌నిచేస్తుంద‌ని క‌మిటీ సభ్యులు పేర్కొన్నారు.

Read Also : పుట్టినరోజు నాడు లాక్‌డౌన్ సేవ‌కుల‌కు కృష్ణంరాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి భీమవరం పాయ‌సం..