Megastar Chiranjeevi : గిన్నిస్ రికార్డ్స్ లో చిరంజీవి.. సీఎంలతో సహా సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు..

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా మెగాస్టార్ కి విషెష్ చెప్తున్నారు.

Megastar Chiranjeevi : గిన్నిస్ రికార్డ్స్ లో చిరంజీవి.. సీఎంలతో సహా సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు..

Fim Political Celebrities Wishes to Megastar Chiranjeevi for achieving Guinness Book of World Record

Updated On : September 23, 2024 / 6:52 AM IST

Megastar Chiranjeevi : నిన్న మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు అందించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును చిరంజీవికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ అంద‌జేశారు. మెగాస్టార్ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది డాన్స్ మాత్రమే. అలాంటి డాన్స్ మీదే చిరంజీవి ఈ రికార్డ్ అందుకోవడం గమనార్హం. 156 సినిమాల్లో 537 పాట‌ల్లో 24000 స్టెప్పులు వేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు చిరంజీవి.

Also Read : Janhvi Kapoor : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై జాన్వీ.. ఈసారికి కుదరలేదు.. తెలుగులో ఎంత బాగా మాట్లాడిందో..

ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించి, ఎన్నో రికార్డులు సృష్టించిన చిరంజీవి ఇప్పుడు గిన్నిస్ రికార్డులో కూడా పేరు సంపాదించడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు, నెటిజన్లు, ప్రముఖులు.. ఇలా అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా మెగాస్టార్ కి విషెష్ చెప్తున్నారు.

.