Janhvi Kapoor : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై జాన్వీ.. ఈసారికి కుదరలేదు.. తెలుగులో ఎంత బాగా మాట్లాడిందో..

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఎన్టీఆర్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఇదే క్రమంలో జాన్వీ కపూర్ కూడా ఓ వీడియో మెసేజ్ విడుదల చేసింది.

Janhvi Kapoor : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై జాన్వీ.. ఈసారికి కుదరలేదు.. తెలుగులో ఎంత బాగా మాట్లాడిందో..

Janhvi Kapoor Reaction on Devara Pre Release event Cancelled Video goes Viral

Updated On : September 23, 2024 / 6:34 AM IST

Janhvi Kapoor : ఎన్టీఆర్ దేవర సినిమాకు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాల్సి ఉంది. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ ఫ్యాన్స్ రావడంతో, హోటల్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం, పోలీసులతో అభిమానులు గొడవలు పెట్టుకోవడంతో, ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేక సిబ్బంది చేతులు ఎత్తేయడంతో మూవీ యూనిట్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో అభిమాను నిరాశగా వెనుతిరిగారు.

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఎన్టీఆర్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఇదే క్రమంలో జాన్వీ కపూర్ కూడా ఓ వీడియో మెసేజ్ విడుదల చేసింది. ఈ వీడియోలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి, నా మీద ఇంత ప్రేమ చూపించిన తెలుగు ఆడియన్స్, నన్ను జాను పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ సర్ ఫ్యాన్స్ అందరికి నా ధన్యవాదాలు. మీరు నన్ను అలా సొంత మనిషిలా ఫీల్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం, అలాగే నాకు కూడా. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. దేవర నా మొదటి అడుగు. శివ సర్, ఎన్టీఆర్ సర్ నన్ను ఈ సినిమాకు సెలెక్ట్ చేసుకోవడం నా అదృష్టం. మా ప్రయత్నం మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. దేవర టీమ్ అందరికి ధన్యవాదాలు నాకు సపోర్ట్ చేసినందుకు అని తెలిపింది.

Also Read : నాకు చాలా బాధగా ఉంది- జూ.ఎన్టీఆర్ ఎమోషనల్.. అభిమానులకు దేవర కీలక విన్నపం…

ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ.. నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబుదాము అనుకున్నాను. కానీ ఈ సారికి అలా కుదరలేదు. మిమ్మల్నందరినీ త్వరలోనే కలుస్తాననుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇది నా నుండి మీకు ఈ చిన్న మెసేజ్ అంటూ పోస్ట్ చేసింది. దీంతో జాన్వీ వీడియో వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)