కౌన్ బనేగా కరోర్‌పతి, అమితాబ్ బచ్చన్‌లపై ఎఫ్ఐఆర్

కౌన్ బనేగా కరోర్‌పతి, అమితాబ్ బచ్చన్‌లపై ఎఫ్ఐఆర్

Updated On : November 3, 2020 / 2:30 PM IST

Amitabh Bachchan: కౌన్ బనేగా కరోర్‌పతి 12 నిర్వాహకులపై, అమితాబ్ బచ్చన్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. మతపరమైన సెంటిమెంట్లను హర్ట్ చేసినందుకుగానూ ఫిర్యాదు చేశారు. శుక్రవారం కరమ్‌వీర్ ఎపిసోడ్ లో పై సోషల్ యాక్టివిస్ట్ బెజవాడ విల్సన్, యాక్టర్ అనూప్ సోనీలు హాట్ సీట్ లో ఉన్నారు.

1927 డిసెంబర్ 25న డా.బీఆర్ అంబేద్కర్ అతని అనుచరులు కాల్చేసిన గ్రంథం పేరేంటి. అని అడిగారు. దానికి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఏ) విష్ణు పురాణ. బీ) భగవద్గీత. సీ) రుగ్వేద. డీ) మనుస్మృతి అని ఛాయీస్ ఇచ్చారు. ఆన్సర్ మనుస్మృతి అనే ఆన్సర్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అమితాబ్ దాని గురించి చర్చించారు.




https://10tv.in/mumbai-court-orders-fir-against-kangana-ranaut-sister-rangoli-for-trying-to-spread-communal-tension/
1927లో జరిగిన ఘటనను అమితాబ్ వివరించడంతో అది నెటిజన్లకు సబబుగా అనిపించలేదు. హిందూ సెంటిమెంట్స్ ను కించపరుస్తున్నారంటూ విమర్శలకు దిగుతున్నారు. అదేగాక తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ రాసిన కవితను కూడా బిగ్ బీ ట్వీట్ చేశారు.

కౌన్ బనేగా కరోర్ పతి రెండు దశాబ్దాలు కంప్లీట్ చేసుకుంది. 2000వ సంవత్సరంలో ఫస్ట్ సీజన్ టెలికాస్ట్ అవగా.. అమితాబ్ బచ్చన్ మోస్ట్ పాపులర్ పేస్ టీవీలో మంచి మార్కెట్ దక్కించుకుంది.