‘గులాబో సితాబో’ : ఆయుష్మాన్ లుక్ – రెండు నెలలముందే రిలీజ్..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గులాబో సితాబో’ 2020 ఫిబ్రవరి 28న విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : October 30, 2019 / 09:32 AM IST
‘గులాబో సితాబో’ : ఆయుష్మాన్ లుక్ – రెండు నెలలముందే రిలీజ్..

Updated On : October 30, 2019 / 9:32 AM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గులాబో సితాబో’ 2020 ఫిబ్రవరి 28న విడుదల కానుంది..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన 50 ఏళ్ళ సినీ ప్రయాణంలో ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశారు. వయసుతో సంబంధం లేకుండా ఎటువంటి చాలెంజింగ్ క్యారెక్టర్స్ అయినా చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘గులాబో సితాబో’.. సినిమా చేస్తున్నారు. సుజిత్ సర్కార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అమితాబ్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

పొడవాటి గెడ్డం, బారు ముక్కు, కళ్లద్దాలతో వృద్ధుడిగా కనిపిస్తున్నారాయన. ఈ గెటప్ కోసం ప్రోస్థెటిక్ మేకప్ వాడుతున్నారు. మేకప్ వేసేటప్పుడు, తీసేటప్పుడు అమితాబ్ అలసిపోయేవారట. ప్రాజెక్ట్ స్టార్ట్ కావడానికి ముందే డైరెక్టర్ అమితాబ్ క్యారెక్టర్ తాలూకు స్కెచెస్ గీయించారట.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఆయుష్మాన్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ‘గులాబో సితాబో’లో అమితాబ్ లక్నోకి చెందిన కోపిష్టి హౌస్ ఓనర్‌గా కనిపించనున్నారు.

Read Also : తెలుగు రాష్ట్రాల్లో ‘విజిల్’ వేస్తున్న విజయ్

ముందుగా ఈ సినిమాను 2020 ఏప్రిల్ 24న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు ప్రీ పోన్ చేశారు. 2020 ఫిబ్రవరి 28న ‘గులాబో సితాబో’ విడుదల కానుంది. రచన : జుహీ చతుర్వేది, సినిమాటోగ్రఫీ : సంతోష్, ఎడిటింగ్ : చందన్ అరోరా, నిర్మాతలు : రోని లహరి, శీల్ కుమార్.