Gam Gam Ganesha second single : ఆనంద్ దేవ‌ర‌కొండ ‘గం.గం..గణేశా’ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్

విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టినా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌.

Gam Gam Ganesha second single : ఆనంద్ దేవ‌ర‌కొండ ‘గం.గం..గణేశా’ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్

Gam Gam Ganesha second single

Gam Gam Ganesha : విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమాతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టినా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. గ‌తేడాది బేబీ సినిమాతో బంప‌ర్ హిట్ కొట్టాడు. తాజాగా ఆనంద్ న‌టిస్తున్న మూవీ ‘గం.గం..గణేశా’. ఉదయ్‌ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్‌. హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి లు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం మే 31 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్, ఓ సాంగ్ ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్ర బృందం.

Prasanna Vadanam : సుహాస్ ‘ప్రసన్న వదనం’ ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌?


‘పిచ్చిగా నచ్చేసావే’ (Picchiga Nacchesave) అంటూ సాగే పాట‌ను మే 4 శ‌నివారం మ‌ధ్యాహ్నాం 12.06 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఓ వైపు కామెడీతో పాటు మ‌రోవైపు రామ‌సీమ బ్యాక్‌డ్రాప్‌తో వ‌స్తుండ‌డంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలే ఉన్నాయి.

Samantha : ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత ఆస‌క్తిక‌ర పోస్ట్.. ఆ రూమ‌ర్ల‌పైనేనా?