Prasanna Vadanam : సుహాస్ ‘ప్రసన్న వదనం’ ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌?

విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు సుహాస్‌.

Prasanna Vadanam : సుహాస్ ‘ప్రసన్న వదనం’ ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌?

Suhas Prasanna Vadanam OTT Partner Fix

Updated On : May 3, 2024 / 11:30 AM IST

Prasanna Vadanam OTT Partner : విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు సుహాస్‌. ఆయ‌న హీరోగా న‌టించిన సినిమా ప్ర‌స‌న్న వ‌ద‌నం. అర్జున్ వైకే ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌. రాశీసింగ్, నందు, వైవా హర్ష, సాయి శ్వేత, నితిన్ ప్రసన్న కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా శుక్ర‌వారం (మే 3న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చింది.

తాజాగా ఈ చిత్రం ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫికైన‌ట్లుగా ఓ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. థియేట్రిక‌ల్ ర‌న్ పూర్తి అయిన త‌రువాత ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంద‌ని స‌ద‌రు వార్త‌ల సారాంశం. బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ చిత్రాన్ని సంగీతం అందించ‌గా జెఎస్ మణికంఠ, టిఆర్ ప్రసాద్ రెడ్డి లు నిర్మించారు.

Sabari Movie Review : వరలక్ష్మి శరత్ కుమార్ ‘శబరి’ మూవీ రివ్యూ.. కూతురి కోసం తల్లి పోరాటం..

ప్రసన్న వదనం కథ విషయానికొస్తే.. సూర్య(సుహాస్)కి ఒక యాక్సిడెంట్ లో వాళ్ళ అమ్మ నాన్నలు చనిపోతారు. ఈ యాక్సిడెంట్ వల్ల సూర్యకి ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే వ్యాధి వస్తుంది. దీని వల్ల ఎవరి మొహాలను గుర్తుపట్టలేడు. అంతే కాకుండా వాయిస్ లు కూడా గుర్తుపట్టలేడు. సుహాస్ ఆర్జేగా పనిచేస్తూ ఉంటాడు. తన సమస్య ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తూ వస్తాడు. కేవలం తనతో ఉండే ఫ్రెండ్ విగ్నేష్(వైవా హర్ష)కి మాత్రమే తెలుసు. ఈ క్రమంలో తన జీవితంలోకి అనుకోకుండా ఆద్య(పాయల్) వస్తుంది. ఏదో ఒకరకంగా తను రెగ్యులర్ గా కలుస్తున్నా గుర్తుపట్టడు. కొన్ని సంఘటనల అనంతరం మంచి ఫ్రెండ్స్ అయి ఆ తర్వాత ప్రేమలో పడతారు.

సూర్య లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న టైంలో తెల్లవారుజామున ఓ అబ్బాయి ఓ అమ్మాయి(సాయి శ్వేత)ని లారీ కిందకి తోసి మర్డర్ చేయడం చూస్తాడు. కానీ అది ఎవరు చేశారో తన ఫేస్ బ్లైండ్ నెస్ ప్రాబ్లమ్ వల్ల తెలుసుకోలేడు. కానీ ఏదో ఒకటి చేయాలని పోలీసులకు బయట కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్తాడు. అనంతరం ఓ వ్యక్తి సూర్యపై అటాక్ చేస్తాడు. దీంతో సూర్య పోలీస్ స్టేషన్ కి వెళ్లి ACP వైదేహి(రాశీసింగ్)కి జరిగిన విషయం, అతని సమస్య చెప్తాడు. కానీ అనుకోకుండా సూర్య అదే మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు మర్డర్ అయిన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు చంపారు? పోలీసులు ఏం చేసారు? ఈ మర్డర్ వల్ల సుహాస్ కి ఎదురైనా ఇబ్బందులు ఏంటి? అసలు సుహాస్ ని ఎవరు ఈ మర్డర్ కేసులో ఇరికించారు? సుహాస్ కి తనకున్న ఫేస్ బ్లైండ్ నెస్ ప్రాబ్లమ్ వల్ల వచ్చిన సమస్యలేంటి? తన ప్రేమ సంగతేంటి? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Anasuya Bharadwaj : బాబోయ్ ఏంటా క్లైమాక్స్‌.. జీవితాంతం గుర్తుంచుకుంటా.. జీవితంలో తొలిసారి ఇలా..