‘గ్యాంగ్ లీడర్’ : అమ్మాయిలు అందంగా ఉండకూడదు – ఇట్స్ ఏ క్రైమ్

'గ్యాంగ్ లీడర్' : వినాయక చవితి సందర్భంగా 'నిను చూసే ఆనందంలో' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ గ్రాండ్‌గా రిలీజవుతుంది..

  • Published By: sekhar ,Published On : September 2, 2019 / 12:06 PM IST
‘గ్యాంగ్ లీడర్’ : అమ్మాయిలు అందంగా ఉండకూడదు – ఇట్స్ ఏ క్రైమ్

Updated On : September 2, 2019 / 12:06 PM IST

‘గ్యాంగ్ లీడర్’ : వినాయక చవితి సందర్భంగా ‘నిను చూసే ఆనందంలో’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ గ్రాండ్‌గా రిలీజవుతుంది..

నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్.. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమా.. ‘గ్యాంగ్ లీడర్’.. వినాయక చవితి సందర్భంగా ‘నిను చూసే ఆనందంలో’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

ప్రియా అరుల్ మోహన్ చీర కట్టుకుని.. ‘ఎలా ఉంది’ అని నానిని అడిగితే, పైనుండి కింది వరకు చూసి.. ‘రైటర్‌నయ్యిండి చెప్పడానికి నాకే మాటలు రావడం లేదు.. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా.. ఇట్స్ ఏ క్రైమ్’.. అనగానే ప్రియా : ‘దగ్గరకు రా’ అని పిలవడంతో ఈ సాంగ్ స్టార్ట్ అవుతుంది. అనంత శ్రీరామ్ బ్యూటిఫుల్ లిరిక్స్ రాయగా, సిడ్ శ్రీరామ్ అంతే చక్కగా పాడాడు. ఈ కూల్ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.

సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ గ్రాండ్‌గా రిలీజవుతుంది. అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, ప్రణ్య, సత్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : అనిరుధ్, కెమెరా : మిరోస్లా కూబా బ్రోజెక్, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : వెంకీ, డార్లింగ్ స్వామి, ఆర్ట్ : రామ్ కుమార్, సీఈఓ : చిరంజీవి (చెర్రీ).