Gangubai Kathiawadi: రూ.200 వందల కోట్ల బ్రేక్ ఈవెన్.. అలియా అందుకుంటుందా?
ఒకప్పుడు బాలీవుడ్‌లో సంచలన సినిమాలు తెరకెక్కించి.. ఆ తర్వాత సరైన విజయాలు లేక ఇబ్బంది పడి మళ్ళీ.. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే జంట రామ్ లీలా సినిమాతో ఫామ్ లోకి వచ్చి..

Gangubai Kathiawadi
Gangubai Kathiawadi: ఒకప్పుడు బాలీవుడ్‌లో సంచలన సినిమాలు తెరకెక్కించి.. ఆ తర్వాత సరైన విజయాలు లేక ఇబ్బంది పడి మళ్ళీ.. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే జంట రామ్ లీలా సినిమాతో ఫామ్ లోకి వచ్చి.. ఆ వెంటనే బాజీరావ్ మస్తానీ, పద్మావతి సినిమాలతో సంచలన విజయాలు అందుకొన్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. తాజాగా ఈయన తెరకెక్కించిన సినిమా గంగూబాయి కతియావాడి. అలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
New Movies: ఇక్కడ భీమ్లా.. తమిళంలో వలిమై.. హిందీలో అలియా కలెక్షన్ల మోత!
టాలీవుడ్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్.. కోలీవుడ్ నుండి తల అజిత్ వలిమై సినిమాలకు పోటీగా బాలీవుడ్ నుండి అలియా భట్ గంగూభాయ్ ని దింపారు మేకర్స్. సంజయ్ లీలా మేకింగ్ తో పాటు అలియా మేకోవర్.. డెడికేషన్, నటనకి అంతకి మించిన మార్కులు పడ్డాయి. ఒక సాధారణ అమ్మాయి వేశ్యగా.. ఆ తర్వాత సాటి వేశ్యలకు అండగా.. కామాటిపురా నాయకురాలిగా ఎదిగిన గంగూబాయి పాత్రలో అలియా తనను తాను ఆవిష్కరించుకున్న విధానాన్ని విమర్శకులు సైతం ప్రశంసించారు.
Gangubai Kathiawadi: గంగూబాయ్ ట్రైలర్ వచ్చేసింది.. వేశ్య పాత్రలో అలియా నట విశ్వరూపం!
అయితే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అన్నదే ఇప్పుడు బిజినెస్ లెక్కేలేసే విశ్లేషకులు అనుమానిస్తున్న మాట. ఎందుకంటే సుమారు రూ.200 కోట్లు రాబడితేనే బ్రేక్ ఈవెన్ దక్కేది. కానీ.. తెలుగు, తమిళంలో స్టార్ల సినిమాలతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. తెలంగాణలో నైజాంలో మాత్రం మంచి వసూళ్లు దక్కించుకుంటున్నట్లు తెలుస్తుండగా మిగతా ప్రాంతలలో వారాంతంలో పుంజుకొని అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వారాంతానికి గంగూభాయ్ రూ.50 కోట్ల క్లబ్ చేరే అవకాశం ఉందంటున్నారు.
Aliya Bhat : సినిమా కోసం నా తల్లిని వేశ్యగా మార్చారు.. ‘గంగూబాయి కతియావాడీ’ సినిమాపై తనయుడి ఆవేదన
ఇక, మిగిలిన రూ.150 కోట్లు లాంగ్ రన్ లో రాబడుతుందా అన్నదే ఇప్పుడు డౌట్. ఎంత లాంగ్ రన్ అయినా వందకోట్లు కలెక్ట్ చేయడమే పెద్ద టాస్క్. మరి మిగతా వంద కోట్ల పరిస్థితి ఏంటి?. నిజానికి కరోనా పాండమిక్, షూటింగ్ డిలే వలన ఈ సినిమా భారీ బడ్జెట్ గా మారింది. తోడు స్టార్స్ లేకుండా అలియాను నమ్మి రూ.200 కోట్లు పెట్టడం పెద్ద టాస్క్ అని అప్పుడే చెప్పగా.. అప్పటికే సినిమా సగభాగం షూటింగ్ లో ఉండడంతో సంజయ్ వెనక్కు తగ్గేందుకు ఇష్టపడలేదు. అలా అని ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. దీంతో అది కాస్త భారీ బడ్జెట్ గా మారింది.