Gautam Ghattamaneni : తండ్రి బాటలోనే తనయుడు.. MB ఫౌండేషన్ లో గౌతమ్ సేవలు..

ఇటీవల కొన్ని రోజుల క్రితం గౌతమ్ రెయిన్‌బో హాస్పిటల్స్ ని సందర్శించి, MB ఫౌండేషన్ ద్వారా చికిత్స చేయించుకున్న పిల్లలను పలకరించాడు. ఆ ఫోటోలని MB ఫౌండేషన్, నమ్రతా తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Gautam Ghattamaneni : తండ్రి బాటలోనే తనయుడు.. MB ఫౌండేషన్ లో గౌతమ్ సేవలు..

Gautam Ghattamaneni spends quality Time with Children who take operations under MB Foundation

Updated On : August 29, 2023 / 7:42 AM IST

Gautam Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) హీరోగా అభిమానులని, ప్రేక్షకులని మెప్పించడమే కొన్ని వందల మంది పిల్లలకు ఉచితంగా వైద్యం అందించి, హార్ట్ ఆపరేషన్స్(Heart Operations) ఉచితంగా చేయిస్తూ ప్రజల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. తన MB ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే అనేక మెడికల్ సేవలు చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ లో తన ఫ్యామిలీ అంతా భాగమయ్యేలా చూసుకున్నారు మహేష్.

మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్(Namrata Shirodkar) MB ఫౌండేషన్ సేవలను దగ్గరుండి చూసుకుంటుంది. ఇక మహేష్ కూతురు సితార(Sitara) కూడా మహేష్ ఫౌండేషన్ కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే తన పాకెట్ మనీతో పాటు తాను మొదట సంపాదించిన యాడ్ మనీ కూడా MB ఫౌండేషన్ కి ఇచ్చేసింది. అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది సితార. ఇప్పుడు గౌతమ్ కూడా మహేష్ ఫౌండేషన్ లో భాగమయ్యాడు.

ఇటీవల కొన్ని రోజుల క్రితం గౌతమ్ రెయిన్‌బో హాస్పిటల్స్ ని సందర్శించి, MB ఫౌండేషన్ ద్వారా చికిత్స చేయించుకున్న పిల్లలను పలకరించాడు. ఆ ఫోటోలని MB ఫౌండేషన్, నమ్రతా తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Balakrishna Vs Nagarjuna : బాలకృష్ణ వర్సెస్ నాగార్జున రీ రిలీజ్‌లో కూడా పోటీ.. మన్మధుడు వర్సెస్ భైరవద్వీపం

గౌతమ్ ఫోటోలని షేర్ చేస్తూ.. MB ఫౌండేషన్స్ రెయిన్‌బో హాస్పిటల్స్ తో కలిసి పిల్లల కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే. MB ఫౌండేషన్ లో భాగమైన గౌతమ్ ఆంకాలజి, కార్డియో వార్డుల్లో పిల్లలతో అప్పుడప్పుడు తన సమయాన్ని గడుపుతాడు. వారు కోలుకుంటున్నప్పుడు వారిని కలిసి మనో ధైర్యాన్ని అందిస్తాడు. ఆ పిల్లల ముఖాల్లో నవ్వులు నింపుతాడు. ఇందుకు గౌతమ్ కు ధన్యవాదాలు అని తెలిపారు. దీంతో మహేష్ అభిమానులు, నెటిజన్లు గౌతమ్ ని అభినందిస్తున్నారు. తండ్రి బాటలోనే తనయుడు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అని అంటున్నారు.