గీతా ఆర్ట్స్ : స్టోరీ బాగుంటే..పెద్ద స్టార్లు అక్కర్లేదు
స్టోరీ బావుంటే చాలు చిన్న సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు భారీ బడ్జెట్ అవసరం లేదు పెద్ద పెద్ద స్టార్లు అవసరం లేదు..

స్టోరీ బావుంటే చాలు చిన్న సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు భారీ బడ్జెట్ అవసరం లేదు పెద్ద పెద్ద స్టార్లు అవసరం లేదు..
స్టోరీ బావుంటే చాలు చిన్న సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు భారీ బడ్జెట్ అవసరం లేదు పెద్ద పెద్ద స్టార్లు అవసరం లేదు.. అనే ఫార్ములాని ఫాలో అవుతోంది మెగా బ్యానర్. చిన్న సినిమాలతో వరుసగా హిట్స్ కొడుతూ పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతోంది. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వస్తోన్న చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. అందుకే ప్రొడ్యూసర్స్ భారీ బడ్జెట్, స్టార్ హీరోలు అంటూ హడావిడి చేయకుండా చిన్న సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఇక స్మాల్ మూవీస్ తో వరుస హిట్లు కొడుతోన్న మెగా బ్యానర్ గీతా ఆర్ట్స్ అదే స్ట్రాటజీని కొనసాగిస్తోంది.
Read Also : ప్రపంచం మెచ్చింది : నా కోడిపిల్లను కాపాడండీ.. పాకెట్ మనీతో ఆస్పత్రికి పరిగెత్తిన బుడతడు
అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ఓ స్మాల్ బడ్జెట్ సినిమాని నిర్మించేందుకు గీతా ఆర్ట్స్ రెడీ అవుతోంది. పక్కా సక్సెస్ ని ఖాతాలో వేసుకునే గీతా ఆర్ట్స్ ప్లాపులతో డీలాపడ్డ అఖిల్ కి హిట్ ఇచ్చేందుకు ట్రై చేస్తోంది. ఏప్రిల్ 9న అఖిల్ సినిమా ప్రారంభంకానుంది. మరో ప్లాప్ హీరో సాయిధరమ్ తేజ్ కి హిట్టిచ్చే బాధ్యతని కూడా గీతా ఆర్ట్సే తీసుకుంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ ఓ సినిమాని నిర్మించనుంది. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న సినిమా పట్టాలెక్కనుంది.
ఇక యంగ్ హీరో శర్వానంద్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రాబోతున్న ‘కూచిపూడి వారి వీధి’ సినిమా కూడా గీతా ఆర్ట్స్ నిర్మాణంలోనే తెరకెక్కనుంది. వీటితో పాటు డైరెక్టర్స్ పరుశురాం, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మరో రెండు సినిమాల్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో రానున్నాయి. ఇలా బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్టులతో గీతా ఆర్ట్స్ టాలివుడ్ ని రౌండప్ చేస్తోంది.
Read Also : నేటికి 46ఏళ్లు : ఫస్ట్ మొబైల్ ఫోన్ కాల్ ఎవరు, ఎవరికి చేశారో తెలుసా?