Genelia Deshmukh : సౌత్‌లో రీఎంట్రీ ఇస్తున్న జెనీలియా.. ఆ సినిమాతోనే..
పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన జెనీలియా ఇటీవలే బాలీవుడ్ లో కూడా రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా సౌత్ లో కూడా రీఎంట్రీ ఇవ్వబోతుంది. గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా.......

Geneliya
Genelia Deshmukh : ‘సత్యం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది జెనీలియా. మొదటి సినిమాతోనే ప్రేక్షకులని మెప్పించింది. ఆ తర్వాత సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ, ఆరెంజ్.. లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి అభిమానులని సంపాదించుకుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా కూడా ఎదిగింది. అప్పుడప్పుడు మధ్యలో తమిళ్, హిందీ సినిమాలు కూడా చేసింది జెనీలియా.
2012లో రానా సరసన ‘నా ఇష్టం’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో సౌత్ సినిమాలకి గుడ్ బాయ్ చెప్పింది. ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ రితీష్ దేశ్ ముఖ్ ను 2013లో పెళ్లి చేసుకొని ముంబైలోనే సెటిల్ అయిపొయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన జెనీలియా ఇటీవలే బాలీవుడ్ లో కూడా రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా సౌత్ లో కూడా రీఎంట్రీ ఇవ్వబోతుంది.
మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. మొదటి సినిమానే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ‘అందాల రాక్షషి’ లాంటి సినిమాలు తీసిన వారాహి చలనచిత్రం బ్యానర్ కిరీటిని హీరోగా పరిచయం చేయబోతుంది. ఇందులో ‘పెళ్లి సందD’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో జెనీలియా ఒక ముఖ్య పాత్రలో నటించనుంది.
Gaurav Chopra : ‘భీమ్లా నాయక్’ హిందీలో రిలీజ్.. పవన్ పాత్రకి డబ్బింగ్ ఎవరో తెలుసా??
తాజాగా జరిగిన ఈ సినిమా ఓపెనింగ్ లో జెనీలియా కూడా పాల్గొంది. దీనికి సంబంధించి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టింది. జెనీలియా ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోలను షేర్ చేసి.. ”సౌత్ సినిమాల్లోకి నా రీఎంట్రీని ఇస్తున్నాను. నా ఇంటిగా భావించే ఇంటికి ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. నన్ను గుర్తుంచుకొని మరీ ఈ సినిమాలో భాగస్వామిని చేసినందుకు సాయి కొర్రపాటి, రాధాకృష్ణ రెడ్డికి ధన్యవాదాలు. డెబ్యూ ఫిల్మ్ సందర్భంగా కిరీటీకి శుభాకాంక్షలు. నీ తొలి చిత్రంలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను” అంటూ పోస్ట్ చేసింది.
ఇక జెనీలియా తెలుగులో మళ్ళీ రీఎంట్రీ ఇస్తుండటంతో జెనీలియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా నిన్న లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమవ్వగా త్వరలో షూటింగ్ మొదలవ్వనుంది.