Gaurav Chopra : ‘భీమ్లా నాయక్’ హిందీలో రిలీజ్.. పవన్ పాత్రకి డబ్బింగ్ ఎవరో తెలుసా??

ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్ర యూనిట్. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 'భీమ్లా నాయక్' సినిమా హిందీలో రిలీజ్ అవ్వలేదు. తాజాగా ఈ సినిమాని హిందీలో........

Gaurav Chopra : ‘భీమ్లా నాయక్’ హిందీలో రిలీజ్.. పవన్ పాత్రకి డబ్బింగ్ ఎవరో తెలుసా??

Gaurav

Updated On : March 5, 2022 / 7:23 AM IST

 

Bheemla Nayak :  పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో ఇటీవల వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమా భారీ విజయం సాధించింది. ఫిబ్రవరి 25న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయంతో పాటు మంచి కలెక్షన్స్ ని కూడా సాధించింది.అయితే ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు చిత్ర యూనిట్. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ‘భీమ్లా నాయక్’ సినిమా హిందీలో రిలీజ్ అవ్వలేదు. తాజాగా ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

ఇటీవలే ‘భీమ్లా నాయక్’ హిందీ వర్షన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ఇటీవల స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళే వేరే భాషల్లో కూడా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. కొంతమంది హీరోలు మాత్రం తమ డబ్బింగ్ తాము చెప్పుకోవట్లేదు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. ‘భీమ్లా నాయక్’ హిందీ వర్షన్ కి పవన్ డబ్బింగ్ చెప్పలేదు. ఈ సినిమా హిందీ వర్షన్ లో పవన్ కళ్యాణ్ కి బాలీవుడ్ బుల్లితెర నటుడు గౌరవ్ చోప్రా డబ్బింగ్ చెప్పాడు.

Radheshyam : వైరల్ అవుతున్న ‘రాధేశ్యామ్’ మేకింగ్ వీడియో.. యూరప్‌లో షూటింగ్ కష్టాలు..

గౌరవ్ నటుడు మాత్రమే కాకండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. హాలీవుడ్ హిందీ డబ్బింగ్ వర్షన్స్ లోని ప్రధాన పాత్రలకు ఇతనే డబ్బింగ్ చెపుతాడు. తాజాగా పవన్ కళ్యాణ్ కి డబ్బింగ్ చెప్పాడు. భీమ్లా నాయక్ హిందీ వర్షన్ ట్రైలర్ ని ట్విట్టర్లో షేర్ చేస్తూ గౌరవ్.. ” లెజెండ్ పవన్ కళ్యాణ్ గారికి భీమ్లా నాయక్ సినిమాకి డబ్బింగ్ చెప్పడం చాలా గర్వంగా భావిస్తున్నాను” అంటూ పోస్ట్ చేసాడు. దీంతో పవన్ అభిమానులు ఆ ట్వీట్ ని షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు.