Getup Srinu : సినిమా రిలీజ్ ముందు షాక్ ఇచ్చిన గెటప్ శ్రీను.. ఆ నిర్ణయం ఇప్పుడెందుకు?

తన సినిమాని బాగా ప్రమోట్ చేయాల్సిన టైములో గెటప్ శ్రీను సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Getup Srinu : సినిమా రిలీజ్ ముందు షాక్ ఇచ్చిన గెటప్ శ్రీను.. ఆ నిర్ణయం ఇప్పుడెందుకు?

Getup Srinu Leaves Social Media at The Time of Releasing his Debut Movie as Hero Raju Yadav

Updated On : May 15, 2024 / 9:27 AM IST

Getup Srinu : జబర్దస్త్ కమెడియన్ గా గెటప్ శ్రీను మంచి పేరు, పాపులారిటీ తెచ్చుకున్నాడు. స్కిట్స్ లో రకరకాల గెటప్స్ వేసి నటనతో కూడా మెప్పించాడు. జబర్దస్త్ తో వచ్చిన ఫేమ్ తో సినిమాల్లో కూడా కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ సినిమాతో రాబోతున్నాడు. మే 17న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రాజు యాదవ్ సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ రిలీజయి ఆసక్తి పెంచాయి.

క్రికెట్ ఆడేటప్పుడు ఫేస్ కి బాల్ తగిలి ఫేస్ ఎప్పుడు నవ్వుతూ ఉండిపోయేలా మారితే హీరో ఎలాంటి కష్టాలు ఎదుర్కున్నాడు అనే కథాంశంతో గెటప్ శ్రీను రాజు యాదవ్ సినిమాతో రాబోతున్నాడు. అయితే సినిమాకి ప్రమోషన్స్ చాలా ముఖ్యం అని తెలిసిందే. అందులోను చిన్న సినిమాలకు ప్రమోషన్స్ మరింత ముఖ్యం. సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేస్తే సినిమాకు అంత ప్లస్ అవుతుంది. అయితే సినిమాని బాగా ప్రమోట్ చేయాల్సిన టైములో గెటప్ శ్రీను సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Also Read : Super Jodi Winner : జీ తెలుగు డాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ విజేతలుగా శ్రీసత్య-సంకేత్​

కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను.. మళ్ళీ కలుద్దాం అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు గెటప్ శ్రీను. అయితే సినిమా ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ ఉండగా ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి? తన సోషల్ మీడియాలో తన సినిమాని ప్రమోషన్స్ చేయడా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడేమో అని అనుకుంటున్నారు. గెటప్ శ్రీను పవన్ కళ్యాణ్ జనసేన తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మే 13 ఎలక్షన్స్ రోజు వరకు సోషల్ మీడియాలో కూడా పవన్ కి సపోర్ట్ గా ప్రచారం చేసాడు. ఇపుడు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను అని చెప్పడంతో ఆశ్చర్యపోతున్నారు అంతా. మరి గెటప్ శ్రీను జూన్ 4న ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలోకి వస్తాడా? లేక సినిమా రిలీజ్ అయ్యాక వస్తాడా చూడాలి.