Super Jodi Winner : జీ తెలుగు డాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ విజేతలుగా శ్రీసత్య-సంకేత్​

డాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ గ్రాండ్ ఫినాలే ముగిసింది.

Super Jodi Winner : జీ తెలుగు డాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ విజేతలుగా శ్రీసత్య-సంకేత్​

Sri Sathya Sanketh win Zee Telugu celebrity dance reality show Super Jodi

Updated On : May 14, 2024 / 3:26 PM IST

ఇంత‌కాలం ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన జీ తెలుగు సెలెబ్రిటీ డాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ గ్రాండ్ ఫినాలే ముగిసింది. 8 సెల‌బ్రిటీ జంట‌లు సీజ‌న్ మొత్తం అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకోగా చివ‌రికి విజేత‌గా శ్రీ సత్య- సంకేత్ జోడి నిలిచింది. సూప‌ర్ జోడీ ట్రోఫీని అందుకుంది.

ఈ సంద‌ర్భంగా శ్రీస‌త్య మాట్లాడుతూ.. సూపర్ జోడీ టైటిల్ గెలవడం ఒక కల లాంటిద‌ని చెప్పింది. తాను ప్రొఫెషనల్ డ్యాన్సర్​ని కాకపోవ‌డంతో సంకేత్ ఎనర్జీకి సరిపోయేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డిన‌ట్లు చెప్పుకొచ్చింది. టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు అందరూ ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌ని, గ‌ట్టి పోటీ ఇచ్చారంది. త‌న ఈ ప్రయాణం ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింద‌ని తెలిపింది. ఈ అనుభ‌వానికి కార‌ణ‌మైన జీ తెలుగు ఛానల్​కు రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చింది.

Dhanush : కోటి రూపాయ‌లు విరాళం ఇచ్చిన స్టార్ హీరో ధ‌నుష్.. ఎందుకోస‌మో తెలుసా?

సూపర్ జోడీ ప్రేక్షకులను అలరించడమే కాకుండా సెలబ్రిటీలు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను కల్పించింది. ఆకట్టుకునే, వినూత్నమైన కార్యక్రమాలను ప్రేక్షకులకు అందించడంలో జీ తెలుగు నిబద్ధతను ఈ షో విజయం మరోసారి రుజువు చేసింది.