Gollapudi Maruthi Rao Wife: గొల్లపూడి మారుతీరావు భార్య కన్నుమూత

సీనియర్ నటులు, దివంగత గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి(81) కన్నుమూశారు.

Gollapudi Maruthi Rao Wife: గొల్లపూడి మారుతీరావు భార్య కన్నుమూత

Gollapudi

Updated On : January 29, 2022 / 1:50 PM IST

Gollapudi Maruthi Rao Wife: సీనియర్ నటులు, దివంగత గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి(81) కన్నుమూశారు. చెన్నైలోని టి.నగర్‌లోని శారదాంబాళ్‌ వీధిలో నివసిస్తున్న ఆమె.. శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

ఈ విషయాన్ని గొల్లపూడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె భౌతికకాయానికి కన్నమ్మపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

హన్మకొండలో జన్మించిన శివకామసుందరికి, మారుతీరావుతో 1961లో వివాహమైంది. రామభక్తురాలైన శివకామ సుందరి మూడున్నర కోట్ల ‘రామకోటి’ రాసినట్లు కుటుంబీకులు చెప్పారు.

2019 డిసెంబరులో మారుతీరావు అనారోగ్యంతో కన్నుమూసిన తర్వాత శివకామసుందరి తన కొడుకు సుబ్బారావు ఇంట్లో ఉంటున్నారు.

గొల్లపూడి మారుతీ రావు, శివకామసుందరి దంపతులకు ఇద్దరు కుమారులు.. వారిలో ఒక కుమారుడు వైజాగ్‌లో ప్రమాదంలో చనిపోయారు.

మారుతీరావు నాటకరంగం నుంచి సినిమారంగం వైపు వచ్చి.. నటనా, రచనా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. కథలు, నవలా రచనతో పాటు జర్నలిస్ట్, టివి యాంకర్, స్క్రీన్ రైటర్, యాక్టర్, ఎడిటర్, డైరెక్టర్ ఇలా విభిన్న రంగాల్లో పనిచేశారు.

కామెడీ, విలన్, సెంటిమెంట్ పాత్ర ఏదైనా తన నటనతో పాత్రకే వన్నె తీసుకొచ్చేవారు గొల్లపూడి.