GopiChand30 : బాలయ్య చెప్పిన టైటిల్‌నే ఖాయం చేసుకున్న గోపీచంద్..

టాలీవుడ్ హీరో గోపీచంద్ తన తదుపరి సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశాడు. గత ఏడాది 'పక్కా కమర్షియల్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో తనకి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ జత కట్టేందుకు సిద్దమయ్యాడు. దర్శకుడు శ్రీవాస్, గోపీచంద్ కలయికలో వచ్చిన లక్ష్యం, లౌక్యం.. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ హిట్టు కాంబినేషన్ తెర పైకి రాబోతుంది.

GopiChand30 : బాలయ్య చెప్పిన టైటిల్‌నే ఖాయం చేసుకున్న గోపీచంద్..

GopiChand30

Updated On : January 14, 2023 / 1:32 PM IST

GopiChand30 : టాలీవుడ్ హీరో గోపీచంద్ తన తదుపరి సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశాడు. గత ఏడాది ‘పక్కా కమర్షియల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో తనకి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ జత కట్టేందుకు సిద్దమయ్యాడు. దర్శకుడు శ్రీవాస్, గోపీచంద్ కలయికలో వచ్చిన లక్ష్యం, లౌక్యం.. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ హిట్టు కాంబినేషన్ తెర పైకి రాబోతుంది.

GopiChand : అన్‌స్టాపబుల్‌లో క్యాన్సర్ పేషెంట్ అయిన చైల్డ్ సింగర్‌కి.. నెక్స్ట్ సినిమాలో ఆఫర్ ఇచ్చిన గోపీచంద్

గోపీచంద్ 30వ సినిమాగా వస్తున్న ఈ మూవీ టైటిల్ ని నేడు అనౌన్స్‌ చేశారు మేకర్స్. ఇటీవల ప్రభాస్ తో కలిసి బాలయ్య అన్‌స్టాపబుల్‌ షోలో గోపీచంద్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో బాలకృష్ణ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తను ఒక టైటిల్ ని సజెస్ట్ చేశాడు. నీ సెంటిమెంట్ ప్రకారం లాస్ట్ లో సున్నా వచ్చేటట్టు, అన్‌స్టాపబుల్‌ షోకి వచ్చిన నిన్న ఎవరు ఆపకూడదు కాబట్టి ‘రామబాణం’ అని పెడుతున్న అంటూ వెల్లడించాడు. దీంతో ఇవాళ ఆ వీడియోని జత చేసి మూవీ టైటిల్ లోగోని లాంచ్ చేశారు మేకర్స్.

డింపుల్ హయతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. జగపతిబాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక వరుస హిట్టులు అందుకుంటున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఒక పక్క శ్రీవాస్, గోపీచంద్ హ్యాట్రిక్ కాంబినేషన్, మరో పక్క సక్సెస్ లో ఉన్న ప్రొడక్షన్ కంపెనీ.. సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇక టైటిల్ లోగో వీడియో ఎండ్ లో బాలకృష్ణ.. ‘ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ కి నేనే వస్తా’ అన్న మాటలని జత చేయడం చూస్తుంటే, చిత్ర యూనిట్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో అర్ధమవుతుంది. మూవీకి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.