Allu Arjun-Sandeep Reddy Vanga : బన్నీ, సందీప్‌రెడ్డి మూవీ ఇప్పట్లో లేనట్లేనా?
సందీప్ రెడ్డి వంగా, బన్నీ కాంబినేషన్‌లో వస్తుందనుకున్న ప్రాజెక్టు ఇప్పట్లో లేనట్లేనన్న టాక్ వినిపిస్తోంది.

Allu Arjun- Sandeep Reddy Vanga
పుష్ప-2 గ్రాండ్ సక్సెస్..ప్యాన్ ఇండియా ఇమేజ్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు అల్లుఅర్జున్. ఆ ప్రాజెక్టు తర్వాత కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న బన్నీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
త్రివిక్రమ్‌తో చేయాలనుకున్న ఓ ప్రాజెక్టు ఇప్పటికే క్యాన్సిల్ అయిందనే ప్రచారం ఉంది. ఇక సందీప్ రెడ్డి వంగా, బన్నీ కాంబినేషన్‌లో వస్తుందనుకున్న ప్రాజెక్టు ఇప్పట్లో లేనట్లేనన్న టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగాతో ప్రకటించిన సినిమాను పక్కనపెట్టి, వేరే ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడని అంటున్నారు. పుష్ప-2 గ్రాండ్ సక్సెస్ కావడం..ప్యాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ బిల్డ్ కావడంతో తర్వాత చేయబోయే ప్రాజెక్టులపై చాలా కేర్ తీసుకుంటున్నాడు బన్నీ. ఈ క్రమంలోనే సందీప్‌తో బన్నీ ప్లాన్ చేసిన సినిమా దాదాపు క్యాన్సిల్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక అల్లు అర్జున్, దిల్ రాజు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రావణం అనే మైథలాజికల్ మూవీ గురించి గాసిప్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రశాంత్ నీల్‌కు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమా పూర్తి చేయాల్సి ఉండటంతో రావణం షూటింగ్ 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
Thug Life : 8 వారాలు అన్నారు.. నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఫ్లాప్ మూవీ..
ఈ కాంబినేషన్ బన్నీ పాన్-ఇండియా ఇమేజ్‌ను మరింత పెంచుతుందనే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో అల్లుఅర్జున్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ మూవీలో బన్నీ ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హాలీవుడ్ రేంజ్ VFXతో తెరకెక్కుతున్నట్లు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూ.700 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుందని టాక్. అట్లీ సినిమా తర్వాత, ప్రశాంత్ నీల్, బన్నీ రావణం సినిమా ట్రాక్ ఎక్కే అవకాశం ఉందంటున్నారు.