తమిళ దర్శకుడితో సేనాని సినిమా.?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.

Gossip Garage Pawan Kalyan movie with tamil director
Gossip Garage : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు ప్రభుత్వంలో కీరోల్..మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా ఆయన షెడ్యూల్ ఫుల్ టైట్ అయిపోయింది. దీంతో తను కమిట్ అయిన మూడు సినిమాలు ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కంప్లీట్ చేసేందుకు టైమ్ సెట్ కావడం లేదు. అందుకే మంగళగిరిలోని పవన్ ఆఫీస్ దగ్గరే హరిహర వీరమల్లు సెట్ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఒప్పుకున్న మూవీస్ తర్వాత పవన్ కాస్త సినిమాలకు దూరంగా ఉంటాడంటున్నారు. అయితే జనసేనాని ఆ మూడు సినిమాలు కంప్లీట్ అయ్యాక ఓ మంచి క్రేజీ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
పవన్‌తో సినిమా చేయబోతున్న క్రేజీ డైరెక్టర్ ఎవరంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అతనెవరో కాదు తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజు అంటూ టాక్ వినిపిస్తుంది. ఇటీవల ఓ తమిళ్ ఛానల్‌కు పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
అయితే ఆ ఇంటర్వూలో పవన్ లోకేశ్ కనకరాజ్ మేకింగ్‌పై కామెంట్స్ చేశారు. లియో సినిమా చూశానని చాలా బాగా తీశాడంటూ లోకేశ్ కనగరాజుపై ప్రశంసలు కురిపించారు పవన్. దీంతో పవన్, లోకేశ్ కనగరాజ్‌తో సినిమా చేయబోతున్నారంటూ అటు కోలీవుడ్ మీడియాలో, ఇటు టాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
ఇప్పుడు తన చేతిలో ఉన్న మూడు సినిమాలను పూర్తి చేసేందుకే షెడ్యూల్ రెడీ చేసుకుంటున్నారు పవన్. మరో సినిమా అంటే..వీలు కుదురుతుందా లేదా అన్నది డౌటే. అయితే పవన్..లోకేశ్ కనగరాజు డైరెక్షన్ మీద ఆసక్తి చూపిస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. ఒకవేళ పవన్ అనుకుంటే ఎలాగోలా టైమ్ సెట్ చేసుకుంటారని అంటున్నారు ఫ్యాన్స్. అయితే పవన్ ఈ సినిమా చేయడం కనుక నిజమే అయితే..లోకేశ్ కనగరాజ్ స్టైల్‌లో పవన్ కనిపిస్తే అది మరో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.
Pawan kalyan : అన్నప్రాశన రోజు పవన్‌కళ్యాణ్‌కు పెట్టిన పేరు ఏంటో తెలుసా?