Samantha : కొండా సురేఖ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత.. నా విడాకులకు, పాలిటిక్స్ కి సంబంధం లేదు..

తాజాగా న‌టి స‌మంత సైతం స్పందించింది.

Samantha : కొండా సురేఖ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత.. నా విడాకులకు, పాలిటిక్స్ కి సంబంధం లేదు..

Samantha respond on Konda Surekha Comments

Updated On : October 2, 2024 / 9:23 PM IST

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ వ‌ల్ల సినీ న‌టుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత విడిపోయార‌ని ఆరోపించారు. దీని పై ఇప్ప‌టికే నాగ‌చైత‌న్య తండ్రి, సినీ న‌టుడు నాగార్జున స్పందించ‌గా తాజాగా న‌టి స‌మంత సైతం స్పందించింది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించింది.

త‌న ప్ర‌యాణ్నాన్ని చిన్నచూపు చూడొద్ద‌ని, విడాకుల‌నేవి పూర్తిగా త‌న వ్య‌క్తిగ‌త విష‌యం అని స‌మంత చెప్పుకొచ్చింది. మా విడాకుల్లో రాజ‌కీయ నేత‌ల ప్ర‌మేయం లేద‌ని చెప్పింది. అన‌వ‌స‌రంగా మీ రాజ‌కీయాల్లో నన్ను లాగ‌కండి. నేనెప్పుడూ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని స‌మంత అంది. ఈ మేర‌కు త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

Pawan kalyan : అన్న ప్ర‌సన్న రోజు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు పెట్టిన పేరు ఏంటో తెలుసా?

‘మ‌హిళ‌గా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారూ.. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాల‌కు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలానే ఉండాలని కోరుకుంటున్నాను’. అని స‌మంత పేర్కొంది.