Pawan Kalyan-Ram Charan : రేర్ కాంబో.! పవన్ మూవీలో చ‌రణ్ కీ రోల్‌?

అప్పుడే హరిహర వీరమల్లు పార్ట్‌-2 గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి.

Pawan Kalyan-Ram Charan : రేర్ కాంబో.! పవన్ మూవీలో చ‌రణ్ కీ రోల్‌?

Hari Hara Veera Mallu, Pawan Kalyan, Ram Charan, Hari Hara Veera Mallu part 2

Updated On : July 4, 2025 / 1:00 PM IST

పవర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్‌ నటిస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ గ్రాండ్‌గా రిలీజ్‌ అయింది. పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌ను, సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎంఎం కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ హైప్‌ను తీసుకొస్తుంది. హరిహర వీరమల్లు పార్ట్-1 ఈ నెల 24న రిలీజ్ కానుండగా.. అప్పుడే హరిహర వీరమల్లు పార్ట్‌-2 గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి.

పవన్ క‌ళ్యాణ్‌ నటిస్తున్న ఈ ఎపిక్ సినిమా రెండు పార్టులుగా విడుదల కానుంది. పార్ట్-1 రిలీజ్‌కు సర్వం సిద్ధమైంది. అయితే పార్ట్-2లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఒక స్పెషల్ రోల్‌లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే పవన్ క‌ళ్యాణ్‌, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్‌లో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఖాయం.

Pawan Kalyan : ఇద్ద‌రు కొడుకుల‌తో క‌లిసి మొద‌టి సారి క‌నిపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఫోటో వైర‌ల్‌

పవన్-చరణ్ కలిసి స్క్రీన్‌పై కనిపిస్తే అది ఫ్యాన్స్‌కి పండగే. హరిహర వీరమల్లు-2లో చరణ్ పాత్ర ఒక కీలకమైన ట్విస్ట్‌ని తీసుకొస్తుందని, ఇది సినిమా స్థాయిని మరో లెవెల్‌కి తీసుకెళ్తుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజమైతే, మెగా ఫ్యాన్స్‌కి ఇది ఊహించని ట్రీట్ అవుతుంది. అయితే హరిహర వీరమల్లు పార్ట్-2లో చరణ్‌ రోల్‌ ఉంటుందా లేదా అనేదానిపై మాత్రం మూవీ యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Thammudu : ‘త‌మ్ముడు’ మూవీ రివ్యూ.. అక్క కోసం తమ్ముడి పోరాటం..

పార్ట్-1 షూటింగ్ దాదాపు పూర్తయింది. పోస్ట్-ప్రొడక్షన్‌తో పాటు VFX వర్క్ జరుగుతోంది. నిధి అగర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, ఎ.ఎం. రత్నం నిర్మాణంలో ఈ చిత్రం భారీ అంచనాలతో రూపొందుతోంది. మరి హరిహర వీరమల్లు-2లో పవన్-చరణ్ కాంబో ఉంటుందా? ఈ గాసిప్ నిజమవుతుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.