Pawan Kalyan : ఇద్ద‌రు కొడుకుల‌తో క‌లిసి మొద‌టి సారి క‌నిపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఫోటో వైర‌ల్‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టి సారి త‌న ఇద్ద‌రు కొడుకుల‌తో క‌లిసి క‌నిపించారు.

Pawan Kalyan : ఇద్ద‌రు కొడుకుల‌తో క‌లిసి మొద‌టి సారి క‌నిపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఫోటో వైర‌ల్‌

Pawan Kalyan seen with his two sons for the first time

Updated On : July 4, 2025 / 12:44 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. త‌న ఇద్ద‌రు కొడుకులు పెద్ద‌కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి వ‌చ్చారు. అధికారులతో, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై చర్చించారు. అనంతరం వారితో కలిసి మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరారు.

అక్కడ ప‌వ‌న్.. జ‌లజీవన్‌ మిషన్‌ కింద రూ.1,290 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని, తిరిగి మధ్యాహ్నం 1:45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం జూలై 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. గురువారం విడుద‌ల చేసిన ఈ చిత్ర ట్రైల‌ర్‌కు అదిరిపోయే స్పంద‌న వచ్చింది. ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్ కేవ‌లం 24 గంట‌ల్లోనే 48 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుని ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాదండోయ్‌.. ఈ చిత్రం అన్ని భాష‌ల్లో 24 గంట‌ల్లో 61.7 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది.