Tollywood : నో ట్రైలర్.. టాలీవుడ్లో నయా ట్రెండ్.!
టాలీవుడ్లో సినిమాల ప్రమోషన్ విషయంలో (Tollywood) కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతున్నలు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
Gossip Garrage no trailer trend in Tollywood
Tollywood : టాలీవుడ్లో సినిమాల ప్రమోషన్ విషయంలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతున్నలు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు సినిమా రిలీజ్‌కు ముందు ట్రైలర్‌తో కథ, పాత్రలు, విజువల్స్‌పై భారీ హైప్ క్రియేట్ చేయడం ఓ ఫార్మాట్‌గా ఉండేది. అందుకు భిన్నంగా ట్రైలర్ లేకుండానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన కొందరు మేకర్స్‌లో మొదలైందని అంటున్నారు.
ఇప్పటికే నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమాకు ట్రైలర్ ఉండదని మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఈ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. ప్యారడైజ్ తరహాలో రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాకు కూడా ట్రైలర్ ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ట్రైలర్లో ఎక్కువ విషయాలు చూపించడం వల్ల ఆడియన్స్ అంచనాలు పీక్స్‌కు వెళ్లి.. సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుందట.
Rashi Singh : రంగుల రంగుల డ్రెస్‌లో రాశి సింగ్.. అద్భుతమైన ఫోటోలు..
అందుకే మేకర్స్ రూట్ మారుస్తున్నారట. కథ, పాత్రలు, కీలక సన్నివేశాలను పూర్తిగా దాచిపెట్టి నేరుగా థియేటర్లలో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చేలా కొత్త ప్రమోషన్ స్ట్రాటజీ వైపు కొందరు అడుగులు వేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ నో ట్రైలర్ కల్చర్ టాలీవుడ్లో కొత్త ట్రెండ్‌గా మారుతుందా.? ఔట్‌పుట్‌ను బట్టి మేకర్స్ థింకింగ్ మారుతుందా అనేది వేచి చూడాలి.
