Governor Tamilisai : ఇంతమంది అభిమానులు ఇక్కడ వచ్చి కన్నీరు పెడుతున్నారంటే.. అయన ఎంత గొప్పగా బ్రతికి ఉంటారు.. గవర్నర్ తమిళిసై!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న తెలంగాణ సీఎం కెసిఆర్, నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కృష్ణకి చివరిసారిగా నివాళు అర్పించిగా, తాజాగా తెలంగాణ గవర్నర్ 'తమిళిసై' కూడా కృష్ణకి గణ నివాళులు అర్పించారు.

Governor Tamilisai : ఇంతమంది అభిమానులు ఇక్కడ వచ్చి కన్నీరు పెడుతున్నారంటే.. అయన ఎంత గొప్పగా బ్రతికి ఉంటారు.. గవర్నర్ తమిళిసై!

Governor Tamilisai Pay last rescept to Super Star Krishna

Updated On : November 16, 2022 / 12:26 PM IST

Governor Tamilisai : టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు నెలలు క్రిందటే కృష్ణ భార్య ఇందిరా దేవి కూడా మరణించడం, ఇప్పుడు ఇలా జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇక అయన పార్థివదేహానికి కడసారి నివాళు అర్పించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు తరలి వస్తున్నారు.

CM Jagan : కృష్ణ పార్థివదేహానికి నివాళు అర్పించిన సీఎం జగన్..

ఈ నేపథ్యంలోనే నిన్న తెలంగాణ సీఎం కెసిఆర్, నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కృష్ణకి చివరిసారిగా నివాళు అర్పించి.. కుటుంబసభ్యులకి దైర్యం చెప్పి ఓదార్చే ప్రయత్నం చేశారు. తాజాగా తెలంగాణ గవర్నర్ ‘తమిళిసై’ కూడా కృష్ణకి గణ నివాళులు అర్పించారు. కన్నీరు పెడుతున్న మహేష్ బాబు చెయ్యి పట్టుకొని ధైర్యం చెప్పి ఓదార్చారు.

ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. “ఇంతమంది అభిమానులు ఇక్కడ వచ్చి కన్నీరు పెట్టుకుంటున్నారు అంటే, అయన ఎంత గొప్పగా బ్రతికి ఉంటారో అర్ధమవుతుంది. కుటుంబసభ్యులకు ఆ దేవుడు బలాన్ని చేకూర్చాలని కోరుకుంటున్న. అయన లోటు సినీ పరిశ్రమకే కాదు, దేశానికీ కూడా తీరని లోటు” అంటూ వ్యాఖ్యానించారు.