Sirivennela : సిరివెన్నెల కుటుంబాన్ని పరామర్శించిన గవర్నర్
తాజాగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు. నిన్న మంగళవారం సాయంత్రం సిరివెన్నెల నివాసానికి గవర్నర్ వెళ్లి.......

Sirivennela
Sirivennela : తెలుగు సాహిత్యానికి తెలుగు పాటలకు ఎనలేని కీర్తిని తెచ్చిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. న్యూమోనియాతో బాధపడుతూ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ సిరివెన్నెల నవంబర్ 30న మరణించారు. సిరివెన్నెల దాదాపు 800 సినిమాలకు 3 వేలకు పైగా పాటలు రాశారు. పద్మశ్రీతో పాటు 11 నంది అవార్డులు, మరెన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
Jahnvi Kapoor : అలాంటి బట్టలు వేసుకోవడం.. ఇబ్బంది పడటం ఎందుకు?.. జాన్వీపై నెటిజన్స్ ట్రోల్..
ఆయన మరణం తర్వాత ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కొంతమంది ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్నారు. తాజాగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు. నిన్న మంగళవారం సాయంత్రం సిరివెన్నెల నివాసానికి గవర్నర్ వెళ్లి ఆయన భార్యను ఓదార్చారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.