Gurur Brahma : ‘నీతోనే నేను’ నుంచి ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ లిరికల్..
‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా నటిస్తున్న చిత్రం నీతోనే నేను (Neethone Nenu). అంజిరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Gurur Brahma Lyrical
Gurur Brahma Lyrical : ‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా నటిస్తున్న చిత్రం నీతోనే నేను (Neethone Nenu). అంజిరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎమ్.సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర వేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఉపాధ్యాయుల దినోత్సవం (టీచర్స్ డే) సందర్భంగా ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
Jawan : ‘జవాన్’ మూవీని మహేష్ బాబుతో కలిసి చూస్తా అంటున్న షారుఖ్ ఖాన్..
మెరుగైన, ఉత్తమ సమాజం రూప కల్పనలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు. అందుకనే వారిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తుంటారు. వారికి అంకితమిచ్చేలా ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ పాటను రూపొందించారు. సుద్ధాల అశోక్ తేజ ఈ పాటను రాగా సింగర్ మనో పాడారు.

Gurur Brahma Lyrical
Aadi Keshava : ఆదికేశవ ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్.. సిత్తరాల సితారావతి శ్రీలీల అంటూ వైష్ణవ..
పాట విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మంచి సమాజం కావాలంటే మనకు గొప్ప ఉపాధ్యాయులు కావాలి. టీచర్స్ వల్లే అది సాధ్యమవుతున్నారు. ఉపాధ్యాయుల గొప్పదనాన్ని తెలియజేసేలా ఈ సినిమాలో ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ పాట ఉంటుందన్నారు. ఈ పాటను టీచర్స్ డే సందర్భంగా విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. కార్తీక్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడన్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తొందరలోనే సినిమా తేదీని ప్రకటిస్తామన్నారు.