Mohanbabu Manchu : మోహన్ బాబు ఫ్యామిలీపై హెయిర్ డ్రెస్సర్ ఆరోపణలు
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వద్ద హెయిర్ డ్రస్సర్ గా పని చేస్తున్న నాగశ్రీను అనేవ్యక్తి మోహన్ బాబు, మంచు విష్ణులపై ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.

Mohan babu manchu
Mohanbabu Manchu : మోహన్ బాబు ఫ్యామిలీపై హెయిర్ డ్రెస్సర్ ఆరోపణలు చేశాడు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వద్ద హెయిర్ డ్రెస్సర్ గా పని చేస్తున్న నాగశ్రీను అనేవ్యక్తి మోహన్ బాబు, మంచు విష్ణులపై ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.
నాగ శ్రీను మోహన్ బాబు వద్ద పదేళ్లుగా హెయిర్ డ్రెస్సర్ గాపని చేస్తున్నాడు. రూ.5 లక్షలు విలువ చేసే హెయిర్ డ్రస్సింగ్ సామాగ్రి చోరీ చేశాడని ఆరోపిస్తూ ఈనెల 17 మోహన్ బాబు అతని కుమారుడు విష్ణు కలిసి నాగ శ్రీనును చిత్ర హింసలు పెట్టినట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు.
తాను ఉద్యోగం మానేసినందుకు మోహన్ బాబు, విష్ణుకలిసి తనను ఫిబ్రవరి 17న తనను చిత్ర హింసలు పెట్టీ చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టి కులం పేరుతో అవమానించారన్నాడు.
Also Read : Mishan Impossible: తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
విష్ణు తనపై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారని…ఈ సంగతి తెలిసి తన తల్లిగుండెపోటుతో ఆస్పత్రిలో చేరిందని…నాలాంటి పేదవాడి జీవితంతో అడుకోవద్దని నాగ శ్రీను విజ్ఞప్తి చేసాడు.