కాజల్ తర్వాత హన్సికనే!

  • Published By: sekhar ,Published On : November 1, 2020 / 01:52 PM IST
కాజల్ తర్వాత హన్సికనే!

Updated On : November 1, 2020 / 1:59 PM IST

Hansika Motwani: ఈ జెనరేషన్ హీరోయిన్లు 50 సినిమాలు చేయడం అనేది చిన్నవిషయం కాదు. కాజల్ అగర్వాల్ ఈ మైల్ రాయిని టచ్ చేసింది. ఆమె తర్వాత హాట్ బ్యూటీ హన్సిక 50వ సినిమా కంప్లీట్ చేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా హిందీలో ఐదు సినిమాలు చేసిన తర్వాత 2006 లో ‘దేశముదురు’ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హన్సిక. (సినిమా 2007 లో విడుదలైంది).



ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నితిన్, రామ్, మంచు విష్ణు, మంచు మనోజ్ వంటి కుర్ర హీరోలందరితోనూ నటించి అలరించింది. తాజాగా 50వ చిత్రంగా తమిళంలో తెరకెక్కుతోన్న ‘మహా’ షూటింగ్‌ పూర్తి చేసింది హన్సిక. ఈ విషయాన్ని హన్సిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది.

SIMBU

‘‘ఇదొక గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. క్లిష్ట పరిస్థితుల్లోనూ ‘మహా’ షూటింగ్‌ పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా షూటింగ్‌ సజావుగా సాగేలా సహకరించిన టీమ్‌కి థ్యాంక్స్. 2021 సమ్మర్లో రిలీజ్ చేయబోతున్నాం. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన శింబుకు ధన్యవాదాలు’’ అని ట్వీట్‌ చేసింది.