Hanu Raghavapudi : నన్ను నమ్మకూడదని ఇండస్ట్రీలో ప్రచారం చేశారు.. వాళ్ళు కనిపిస్తే డైరెక్ట్ గానే అడిగేస్తాను..

హను రాఘవపూడి కథ బాగా చెప్పినా సినిమా సరిగ్గా తీయడని, సెకండ్ హాఫ్ చెడగొడతాడని ఒక టాక్ వచ్చింది ఇండస్ట్రీలో. ఇదే విషయం హను కూడా సీతారామం సినిమా ప్రమోషన్స్ లో చెప్పాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో..

Hanu Raghavapudi : నన్ను నమ్మకూడదని ఇండస్ట్రీలో ప్రచారం చేశారు.. వాళ్ళు కనిపిస్తే డైరెక్ట్ గానే అడిగేస్తాను..

Hanu Raghavapudi reacts on negative comments about him

Updated On : December 19, 2022 / 10:55 AM IST

Hanu Raghavapudi :  అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమగాధ, లై, పడిపడి లేచే మనసు.. లాంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ప్లేస్ ని క్రియేట్ చేసుకున్నాడు హను రాఘవపూడి. లవ్ స్టోరీస్ ని హను కంటే అందంగా ఎవరూ చూపించలేరు అనే మార్క్ ని సృష్టించాడు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఒక ఫీల్ గుడ్ మూవీ అందించాలంటే హనుకే సాధ్యం అని అనిపించుకున్నాడు.

ఇటీవల సీతారామం సినిమాతో వచ్చిన హను ఆ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులని మ్యాజిక్ చేశాడు హను రాఘవపూడి. ఆ సినిమా ట్రాన్స్ లో ప్రేక్షకులని ఉండిపోయేలా చేసి అందులోని పాత్రలకి కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఎప్పటికి గుర్తుండిపోయే సినిమాలా నిలిచింది సీతారామం.

అయితే హను రాఘవపూడి కథ బాగా చెప్పినా సినిమా సరిగ్గా తీయడని, సెకండ్ హాఫ్ చెడగొడతాడని ఒక టాక్ వచ్చింది ఇండస్ట్రీలో. ఇదే విషయం హను కూడా సీతారామం సినిమా ప్రమోషన్స్ లో చెప్పాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హను దీనిపై మరోసారి స్పందించాడు.

Ramya : సమంత, రష్మిక.. ఇప్పుడు దీపిక.. ఆడవాళ్ళ మీదే మీ విమర్శలు.. సంచలన ట్వీట్ చేసిన కన్నడ నటి..

హను రాఘవపూడి మాట్లాడుతూ.. నేను కథ బాగా చెప్తాను కానీ సినిమా సరిగ్గా తీయను అని కొంతమంది నా మీద నెగిటివ్ ప్రచారం చేశారు ఇండస్ట్రీలో. నన్ను నమ్మొద్దు అంటూ ప్రచారం చేశారు. అయితే నన్ను ఏ విషయంలో నమ్మొద్దో చెప్పలేదు. ఇలా నా మీద నెగిటివ్ గా ప్రచారం చేసిన వాళ్లెవరో కూడా నాకు తెలుసు. వాళ్ళని ఇంకా కలవలేదు. ఒకవేళ వాళ్ళని కలిస్తే నన్ను ఏ విషయంలో నమ్మొద్దు అని చెప్పారో, అలా ఎందుకు చెప్పారో కచ్చితంగా అడుగుతాను అని అన్నారు. మరి హను రాఘవపూడి మీద నెగిటివ్ ప్రచారం చేసింది ఎవరో.